'శక్తి' దర్శకుడి చేతికి మహేష్ సినిమా

'శక్తి' దర్శకుడి చేతికి మహేష్ సినిమా

మెహర్ రమేష్.. ఈ పేరు చెబితే అటు ఇండస్ట్రీ జనాలు, ఇటు ప్రేక్షకులు కూడా ఒకేసారి ఉలిక్కి పడతారు. ఒక కంత్రి.. ఒక శక్తి.. ఒక షాడో.. మామూలు డిజాస్టర్లు ఇచ్చాడా ఈ దర్శకుడు. పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చి తొలి సినిమానే ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో, అశ్వినీదత్ లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్‌తో చేసేసరికి చాలా పెద్ద రేంజికి వెళ్లిపోతాడని అంతా అనుకున్నారు.

కానీ 'పోకిరి'ని కొట్టాలని అదే స్టయిల్లో 'కంత్రి'.. 'మగధీర'ను మించాలని అదే తరహాలో 'శక్తి' తీసి ఎన్టీఆర్‌, దత్‌లకు భారీ నష్టమే చేశాడు. వీటి నుంచి ఆ ఇద్దరూ కోలుకోవడం చాలా కష్టమైంది. ఆ తర్వాత 'షాడో'తో విక్టరీ వెంకటేష్‌కు కూడా చేదు అనుభవం మిగిల్చాడు. 'బిల్లా' సినిమా ఓ మాదిరిగా ఆడింది కానీ.. అది రీమేక్ మూవీ కాబట్టి ఆ మాత్రం క్రెడిట్ కూడా మెహర్‌కు ఇవ్వడానికి లేదు.

'షాడో' ఫలితం చూశాక మెహర్‌కు మళ్లీ ఇంకో అవకాశం ఇచ్చే సాహసం ఏ హీరో, నిర్మాతా చేయలేదు. ఆరేళ్లుగా సినిమా లేక ఖాళీగా ఉన్నాడు. ఐతే సినిమాలు తీయకపోయినా.. ఏవో కమర్షియల్స్ చేసుకుంటూ, సూపర్ స్టార్ మహేష్ బాబు పీఆర్ పనులు చూసుకుంటూ ఏదో అలా నెట్టుకొస్తున్నాాడు. కానీ సినిమాలతో మాత్రం నేరుగా అతడికి ఎలాంటి సంబంధం ఉండట్లేదు. ఐతే తన దగ్గర నమ్మకంగా పని చేస్తున్న మెహర్‌కు మహేష్ ఓ సాయం చేసి పెడుతున్నట్లు సమాచారం. తన కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను ఒక పెద్ద ఏరియాలో రిలీజ్ చేసే అవకాశం మెహర్‌కు ఇచ్చాడట.

ఆంధ్రా ప్రాంతంలో బాగా బిజినెస్ జరిగే గుంటూరు ఏరియాలో 'సరిలేరు..' సినిమాను మెహరే రిలీజ్ చేయబోతున్నాడట. మహేష్ సిఫారసు మేరకు నిర్మాతలు దిల్ రాజు, అనిల్ రావిపూడి కాస్త రీజనబుల్ రేటుకే మెహర్‌కు హక్కులు ఇచ్చారట. ఈ ప్రయత్నం ఫలిస్తే మున్ముందు మెహర్ డిస్ట్రిబ్యూటర్‌గా సెటిలైనా అవుతాడేమో. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English