సెప్టెంబర్‌ 13... టాలీవుడ్‌ ఈగో క్లాష్‌!

సెప్టెంబర్‌ 13... టాలీవుడ్‌ ఈగో క్లాష్‌!

సెప్టెంబర్‌ 13 రిలీజ్‌ అంటూ ప్రతి పోస్టర్‌పై తాటికాయంత అక్షరాలతో హల్‌చల్‌ చేస్తున్నారు గ్యాంగ్‌లీడర్‌, వాల్మీకి మేకర్స్‌. ముందుగా ఈ డేట్‌ని రిజర్వ్‌ చేసుకున్నది వాల్మీకి టీమ్‌ అయినా కానీ 'సాహో'లాంటి సినిమాకి స్పేస్‌ ఇవ్వడం కోసం గ్యాంగ్‌లీడర్‌ వెనక్కి జరిగాడు. సెప్టెంబర్‌ 13 డేట్‌ తమకి కావాలంటూ గ్యాంగ్‌లీడర్‌ నిర్మాతలు 'వాల్మీకి' నిర్మాతలని అడిగారు. కానీ ఆ చిత్ర దర్శకుడు మాత్రం తాను అనుకున్న డేట్‌కి సినిమా విడుదలవ్వాల్సిందే అని పట్టుబట్టినట్టు గుసగుసలాడుకుంటున్నారు. పోస్ట్‌పోన్‌ చేయడానికి హరీష్‌ శంకర్‌ పిచ్చ వ్యతిరేకంగా వున్నాడట.

బిజినెస్‌ పరంగా గ్యాంగ్‌లీడర్‌ పెద్ద సినిమా కనుక వాల్మీకి వెనక్కి వెళ్లకపోతే తాము కూడా మరో డేట్‌ చూసుకునేది లేదని ఆ చిత్ర నిర్మాతలు ఫిక్స్‌ అయిపోయారు. అలా ఇప్పుడు సెప్టెంబర్‌ 13న తెలుగు సినిమా బాక్సాఫీస్‌ వద్ద మినీ రణం జరగబోతోంది. ఇంతవరకు ఇద్దర్లో ఎవరూ వెనక్కి తగ్గలేదు కనుక ఇక క్లాష్‌ అనివార్యంగా కనిపిస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నా కానీ ఆ వారంలో కనీసం ఒక్క హాలిడే కూడా లేకపోవడంతో ఒక దాని బిజినెస్‌ని మరొకటి దెబ్బ తీస్తాయనే ఆందోళన బయ్యర్లలో నెలకొంది. ఈ ఈగో క్లాష్‌లో అంతిమంగా లాభపడేది ఎవరో కానీ సాహో, సైరాతో పాటు సెప్టెంబర్‌ 13 కూడా తెలుగు సినిమా ట్రేడ్‌ని అమితంగా ఆకర్షిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English