డిజాస్టార్ల హీరోయిన్.. పెళ్లి చేసేసుకుంది

డిజాస్టార్ల హీరోయిన్.. పెళ్లి చేసేసుకుంది

అనీషా ఆంబ్రోస్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్లో ఆమెకు చాలా అవకాశాలే వచ్చాయి కానీ.. ఒక్కటి కూడా ఆమె ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తాజాగా ‘7’ అనే సినిమాతో పలకరించిన అనీషా.. మరో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకుంది. ఆమె చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

పెళ్లి వేడుక అనంతరం వరుడితో కలిసి అనీషా ఉన్న ఫొటో ఇంటర్నెట్లో కనిపిస్తోంది. ఐతే వరుడు ఎవరు.. ఆమెది ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన పెళ్లా అన్నది వెల్లడి కాలేదు. ఇంత సడెన్‌గా పెళ్లి ఎందుకు చేసుకుందన్నది కూడా తెలియడం లేదు. వరుడితో కలిసి అనీషా రిసెప్షన్లో నిలబడి ఉన్న ఫొటో మాత్రమే ఇంటర్నెట్లో కనిపిస్తోంది.

‘అలియాస్ జానకి’ అనే సినిమాతో అనీషా కథానాయికగా పరిచయం అయింది. పవన్ కళ్యాణ్‌తో ‘పంజా’ సినిమా తీసిన నీలిమ నిర్మించిన సినిమా ఇది. ఆమె ద్వారా అనీషా పవన్‌కు పరిచయం అయింది. ఆమెకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో కథానాయికగా అవకాశం ఇవ్వాలనుకున్నాడు పవన్. కానీ ఈ విషయం వెల్లడి కాగానే పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో తమ ఫ్రస్టేషన్ అంతా చూపించేయడంతో పవన్ టీం వెనుకంజ వేసింది.

ఐతే పవన్ నటించిన ‘గోపాల గోపాల’లో ఆమె చిన్న అతిథి పాత్ర చేసిింది. ఆ తర్వాత ‘రన్’, ‘ఫ్యాషన్ డిజైనర్’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి సినిమాల్లో అనీషా నటించింది. అనీషా బ్యాడ్ లక్ ఏమో కానీ.. ఆమె నటించిన చాలా సినిమాలు డిజాస్టర్లయ్యాయి. ‘ఈ నగరానికి ఏమైంది’ మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English