కంగన కవ్వించింది.. ముందే వస్తున్నాడు

కంగన కవ్వించింది.. ముందే వస్తున్నాడు

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సూపర్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ల మధ్య కయ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడిచినట్లుగా గుసగుసలు వినిపించాయి. కానీ వీరి ఎఫైర్ గురించి బయటికి పొక్కాక ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగాయి. కంగనా పలుమార్లు హృతిక్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసింది.

ఒకట్రెండుసార్లు హృతిక్ కూడా దీటుగా స్పందించాడు. తన కొత్త సినిమా వచ్చిన ప్రతిసారీ కంగనా.. హృతిక్‌ను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అతడితో బాక్సాఫీస్ పోరుకు కూడా ఆమె తహతహలాడిపోతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ హృతిక్ సినిమా ‘సూపర్ 30’ జులై 26న రావాల్సి ఉండగా.. అదే రోజుకు తన సినిమా ‘మెంటల్ హై క్యా’ను షెడ్యూల్ చేసి పెట్టింది కంగనా. దీని మీద వివాదం నడవగా.. హృతికే తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు. దీని మీద కంగనా సెటైర్లు వేసింది.

ఐతే సెప్టెంబరుకు వాయిదా పడ్డ ‘సూపర్ 30’ని ముందుకు తీసుకొచ్చి కంగనా చిత్రం కంటే ముందు రిలీజ్ చేయాలని హృతిక్ అండ్ టీమ్ డిసైడైవడం విశేషం. ఈ చిత్రాన్ని జులై 12నే రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ ఫైనల్ అట. కంగనా సినిమా కంటే రెండు వారాల ముందే తన చిత్రాన్ని షెడ్యూల్ చేసిన హృతిక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం రాబడతాడో చూడాలి.

జనవరిలోనే రావాల్సిన ‘సూపర్ 30’.. దర్శకుడు వికాస్ బల్ అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి చివరి దశలో తప్పుకోవాల్సి రావడంతో వాయిదా పడింది. ప్రొడక్షన్ టీంలోని ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడటం వల్ల వికాస్ ఈ సినిమాకు దూరమయ్యాడు. దర్శకుడు లేకుండానే ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయడం విశేషం. బీహార్లో ‘సూపర్ 30’ పేరుతో ఇన్‌స్టిట్యూట్ పెట్టి పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇచ్చిన ఆనంద్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English