కేజీఎఫ్ ఛాప్టర్-2.. డోస్ ఇంకా ఎక్కువేనట

కేజీఎఫ్ ఛాప్టర్-2.. డోస్ ఇంకా ఎక్కువేనట

కన్నడ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయిన చిత్రం ‘కేజీఎఫ్’. ఒక కన్నడ సినిమా కర్ణాటక దాటి వేరే ప్రాంతాల్లో రిలీజవ్వడమే గగనం అంటే.. ఈ చిత్రం వేరే నాలుగు భాషల్లో రిలీజై అన్ని చోట్లా సంచలన వసూళ్లు రాబట్టింది. కన్నడలో అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ హిట్ కంటే నాలుగైదు రెట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒక కన్నడ సినిమా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడమంటే చిన్న విషయం కాదు. కర్ణాటక బార్డర్ దాటి చాలా చోట్ల ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబట్టింది.

ఐతే ప్రేక్షకులు చూసింది ‘కేజీఎఫ్’ తొలి ఛాప్టరే. ఇందులో ఇంకో అంకం కూడా ఉంది. ‘బాహుబలి’ తరహాలో దీన్ని కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. రెండో భాగానికి సంబంధించి ఆల్రెడీ కొంత చిత్రీకరణ జరిపారు. మిగతా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. చకచకా పని పూర్తవుతోంది.

‘కేజీఎఫ్ ఛాప్టర్-2’ షూటింగ్ మొదలయ్యాక ఇప్పటిదాకా ఏ అప్ డేట్ లేదు. ఐతే తాజాగా చిత్ర బృందం నుంచి ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. ‘కేజీఎఫ్ ఛాప్టర్-1’కు సంబంధించి ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకర్షించింది యాక్షన్ పార్టే. హీరో ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు చూసి జనాలకు మతిపోయింది. ‘ఛాప్టర్-2’లో ఇంతకుమించి యాక్షన్ ఉంటుందని అంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరింతగా హీరోయిజంతో రెండో భాగాన్ని అతను తీర్చిదిద్దుతున్నాడట. ప్రస్తుతం బెంగళూరులో చిత్రీకరణ సాగుతోంది. సెప్టెంబరుకల్లా 90 శాతం షూట్ అయిపోతుందని కూడా వెల్లడించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు నటిస్తున్నట్లు కూడా ప్రశాంత్ ధ్రువీకరించాడు.

సంజయ్ దత్, రవీనా టాండన్‌లు ఈ సినిమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే చిత్ర బృందం కొత్త షెడ్యూల్ కోసం రామోజీ ఫిలిం సిటీకి రానుంది. కుదిరితే ఈ చిత్రాన్ని గత ఏడాది లాగే క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English