రాజశేఖర్‌ కూతురికి ఏదీ కలిసి రావట్లేదు

రాజశేఖర్‌ కూతురికి ఏదీ కలిసి రావట్లేదు

రాజశేఖర్‌, జీవిత దంపతుల పెద్ద కూతురు శివానిని కథానాయికగా పరిచయం చేయాలని చాలా కాలంగా ప్రయత్నం జరుగుతోంది. అప్పట్లో రాజశేఖర్‌ నిర్మాణంలోనే ఆమె ప్రధాన పాత్రలో ఒక సినిమా కూడా మొదలయింది. కానీ ఆ చిత్రం విడుదల కాకుండా ఆగిపోయింది. ఆఫ్‌బీట్‌ సినిమా కావడంతో కమర్షియల్‌ హీరోయిన్‌ కావడానికి అది కరక్ట్‌ లాంఛ్‌ కాదని రాజశేఖర్‌ ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. గూఢచారి తర్వాత అడివి శేష్‌ హీరోగా 2 స్టేట్స్‌ చిత్రం రీమేక్‌ మొదలయింది.

ఇందులో కథానాయికగా శివాని ఎంపికయింది. ఈ చిత్రం కూడా కొన్నాళ్లు షూటింగ్‌ జరుపుకున్న తర్వాత అవుట్‌పుట్‌ అంత బాగా రావడం లేదని ఆపేసి రిపేర్లకి ప్రయత్నించినా ఇంతవరకు అది ముందుకి వెళ్లలేకపోయింది. మళ్లీ ఈ చిత్రం తిరిగి ట్రాక్‌ ఎక్కుతుందా లేదా అనేది కూడా తెలియడం లేదని వినిపిస్తోంది. శివాని డెబ్యూకి ఇలా వరుస ఆటంకాలు ఎదురవుతోంటే రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక నటించిన చిత్రం దొరసాని మాత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ తమ్ముడు హీరోగా నటిస్తుండడంతో దీనిపై మార్కెట్‌ వర్గాల్లో కాస్త ఆసక్తి నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English