మోక్షజ్ఞతో నిహారిక.. అసలేంటి కథ?

  మోక్షజ్ఞతో నిహారిక.. అసలేంటి కథ?

నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదంటూ కొన్ని రోజుల కిందట మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆ సమయంలో బాలయ్యను నాగబాబు గట్టిగానే టార్గెట్ చేశాడు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌‌ను బాలయ్య అండ్ కో రాజకీయంగా టార్గెట్ చేయడంతో నాగబాబుకు మండిపోయింది. ఓ సందర్భంలో పవన్ ఎవరో తెలియదని బాలయ్య అనడంతో నాగబాబు కౌంటర్లు వేశాడు.

బాలయ్య ఎవరో తెలియదంటూ వరుసబెట్టి సెటైర్లు గుప్పించాడు. ఐతే ఆ సందర్భంలో నాగబాబు తనయురాలు నిహారిక, బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కలిసి ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. మరి నాగబాబుకు బాలయ్య ఎవరో తెలియకుండానే వీళ్లిద్దరు పిల్లలు కలిసి ఫొటోలు దిగారా అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. ఐతే నాగబాబు ఉద్దేశం వేరు కాబట్టి దాని గురించి ఆయనేమీ స్పందించలేదు.

ఐతే నిహారిక ఇప్పుడు తన కొత్త సినిమా ‘సూర్యకాంతం' ప్రమోషన్ల కోసం మీడియా ముందుకొచ్చింది. దీంతో ఆమెకు మోక్షజ్ఞతో ఉన్న ఫొటోల గురించి ప్రశ్న తలెత్తింది. దీనికామె బదులిచ్చింది. డిగ్రీ కాలేజీలో మోక్షజ్ఞ తన జూనియర్ అని.. అప్పుడు అతడితో కొద్దిగా పరిచయం ఏర్పడిందని నిహారిక తెలిపింది. ఆ సమయంలో తాము దిగిన ఫొటోలే.. ఏదో రకంగా ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చాయని నిహారిక చెప్పింది.

ఐతే ఇప్పుడు మోక్షజ్ఞ తనతో టచ్‌లో లేడని.. ప్రస్తుతం అతను ఎక్కడున్నాడో కూడా తనకు తెలీదని నిహారిక చెప్పింది. ఇక బాలయ్యపై నాగబాబు చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తే.. తన తండ్రి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. వాటితో తనకు సంబంధం లేదని నిహారిక చెప్పింది. పెళ్లి అయ్యే వరకు తన జీవితం తన ఇష్టమని.. తనకు ఇంట్లో పూర్తి స్వేచ్ఛ ఉందని నిహారిక చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English