ట్రెయిలరే తప్ప ఎన్టీఆర్‌లో మేటర్‌ నిల్‌?

ట్రెయిలరే తప్ప ఎన్టీఆర్‌లో మేటర్‌ నిల్‌?

ఏ సినిమా అయినా వేడి మీద వుండగానే థియేటర్లలోకి వచ్చేయాలి. మంచి పబ్లిసిటీ లభించినపుడు దానిని ఎంత త్వరగా క్యాష్‌ చేసుకుందామా అని చూడాలి. అంతే కానీ క్రేజ్‌ వుంది కదా అంటూ ఊరిస్తూ పోతే ఆ తర్వాత దాని మీద మునుపు వున్న ఆసక్తి తగ్గిపోయే ప్రమాదముంది. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌కి పోటీగా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' తీసిన వర్మ ఎందుకో దానితో పాటుగా విడుదల చేయలేకపోయాడు. కనీసం దాంతో పాటు కాకపోయినా కాస్త ఆలస్యంగా అయినా విడుదల చేయాల్సింది. అదీ చేయలేక చివరకు మార్చి 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. బాలకృష్ణ సినిమా ఫ్లాప్‌ అయి, ఈ చిత్రానికి క్రేజ్‌ వుండాలని బాలయ్య వ్యతిరేక వర్గం ఎదురు చూసింది. తీరా ఆ చిత్రమే దారుణంగా ఫ్లాప్‌ అవడంతో ఇప్పుడా వర్గానికి 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ఫలితం పట్ల ఎక్కువ ఆసక్తి లేదు.

వేడి మీద వుండగా రాకపోవడం వల్ల ట్రెండింగ్‌లో వున్నపుడు ఆసక్తి చూపించిన వారు కూడా ఇప్పుడీ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు. అలా, అలా నెమ్మదిగా క్రేజ్‌ తగ్గిపోతూ వుండగా, ఇండస్ట్రీనుంచి ఈ చిత్రం గురించి కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ట్రెయిలర్‌ చూసి ఏదో వుంటుందని భ్రమ పడతారని, కానీ సినిమాలో అంత సంచలనం ఏమీ లేదని, చాలా నిదానంగా సాగుతూ, ఎక్కువగా డ్రామా లేకుండా చప్పగా వుంటుందని ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఇంతవరకు ట్రెయిలర్‌ మినహా వర్మ ఈ చిత్రానికి అడిషినల్‌ క్రేజ్‌ తీసుకురాలేదనే చెప్పాలి. క్రేజ్‌ వుందని ఎక్కువ రేట్లు కోట్‌ చేస్తున్నపుడు సినిమాలో మేటర్‌ సరిపడా లేకపోతే రికవరీ కష్టం మరి. అసలే వర్మ సినిమా బాలేదనే టాక్‌ వస్తే డ్రాప్‌ అయిపోయే జనాలు ఎక్కువ వుంటారనేది వింత కూడా కాదాయె.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English