చిరు పక్కన ఆ నలుగురిలో ఒకరు

చిరు పక్కన ఆ నలుగురిలో ఒకరు

మెగాస్టార్ చిరంజీవి ఓవైపు తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తూనే.. మరోవైపు ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా కథా చర్చల విషయంలో జరుగుతున్న ఊహాగానాలకు తెర దించుతూ.. ఇటీవలే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి స్క్రిప్టు రెడీ అయినట్లు ఇంకొన్ని నెలల్లోనే చిత్రీకరణ మొదలు కానట్లు అందులో పేర్కొన్నారు.

ఇంకో రెండు మూడు నెలల్లో ‘సైరా’ చిత్రీకరణ పూర్తి చేసి కొరటాల సినిమాను మొదలుపెట్టబోతున్నాడు చిరు. ఈ సినిమా కోసం చిరు తన లుక్ కూడా మార్చుకుంటున్నాడు. ‘సైరా’ కోసం పెరిగిన బరువును చిరు తగ్గించుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి కథానాయికను ఇప్పుడే ఖరారు చేసే పనిలో ఉన్నాడట కొరటాల.

చిరుకు జోడీగా నలుగురు భామల్ని పరిశీలిస్తున్నారట. ఆ నలుగురూ సీనియర్ హీరోయిన్లే. ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’లో చిరు సరసన నటిస్తున్న నయనతారనే ఈ సినిమాకు కూడా ఎంచుకుందామా అని చూస్తున్న కొరటాల.. ఇంకో ముగ్గురి మీద దృష్టిపెట్టాడు. అందులో ఇంతకుముందు ‘స్టాలిన్’లో చిరుతో జత కట్టిన త్రిష.. ‘సైరా’లో ఒక అతిథి పాత్ర చేస్తున్న తమన్నా కూడా ఉన్నారు. అలాగే ‘యన్.టి.ఆర్’తో దక్షిణాదిన అడుగుపెట్టిన బాలీవుడ్ భామ విద్యాబాలన్ మీద కూడా దృష్టి పెట్టాడట.

ఈ నలుగురిలో ఒకరు ఎవరనే విషయంలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వీరిలో తమన్నాను కానీ.. త్రిషను కానీ అడిగితే వాళ్లున్న పొజిషన్లో ఎగిరి గంతేసి సినిమా ఒప్పుకుంటారు. మిగతా ఇద్దరిని ఒప్పించాలంటే కొంచెం కష్టపడాలి. ఐతే చిరు పక్కన ఈ దశలో వాళ్లిద్దరిలో ఒకరైతేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కొరటాల, చిరు ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English