పిక్ టాక్ః బాత్ టబ్బులో యాంకర్ శ్రీముఖి

పిక్ టాక్ః బాత్ టబ్బులో యాంకర్ శ్రీముఖి

తళాతళా మెరిసే గ్రానైట్ స్టోనుతోనో లేదంటే ఫైబర్ మెటీరియల్ తోనో చేసిన ఒక బాత్ టుబ్. గులాభి పువ్వు రేకులతో నింపబడిన నీరు. అందులో నురగలు కారుతూ వయ్యారంగా ఫోజిచ్చే ఒక హాట్ మోడల్. ఒకప్పుడు ఇటువంటి ఫోటోలకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. దాదాపు ప్రతీ హీరోయిన్ ప్రతీ హాట్ మోడల్ ఇలాంటి షూట్ ఒకటి చేసేవారు.

ఇప్పుడు మన క్యూట్ యాంకర్ శ్రీముఖి కూడి ఇలాంటి ఫోజే ఒకటి ఇచ్చింది. బాత్ టబ్బులు.. బ్లాక్ అండ్ ఫోటోలు.. అదిరిపోతాయ్ కదూ అంటూ జోస్యం కూడా చెబుతోంది. అమ్మడి ఫోటో అయితే బాగానే ఉంది కాని.. ఎందుకో బ్లాక్ వైట్ లో చూస్తే అస్సలు అక్కడుంది శ్రీముఖేనా అనే సందేహం మాత్రం వస్తోంది. కాకపోతే కాస్త చబ్బీగా ఉండటం వలన.. అరే మన యాంకరే అని గుర్తుపట్టొచ్చు. వెండి తెర మీద పెద్దగా క్లిక్కవ్వని ఈ నిజామాబాద్ పోరి.. బుల్లితెరపై మాత్రం ఇలా తన సోయగాలతో బాగానే సందడి చేస్తోంది.

ఇకపోతే బాత్ టబ్ ఫోటోలు అంటేనే ఇప్పుడు విరక్తి వచ్చేసింది అంటున్నారు కొందరు. లెజండరీ హీరోయిన్ శ్రీదేవి దుబాయ్ లో చనిపోయాక.. మన న్యూస్ ఛానళ్ళు డైరక్టుగా బాత్ టబ్ లో కెమెరాలు పెట్టేసి ఇచ్చిన లైవ్ కవరేజ్.. తెలుగోళ్ళకి బాత్ టబ్స్ అంటేనే విరక్తి తెప్పించేసిందిలే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English