అల్లు శిరీష్ లైన్లోకి వచ్చాడబ్బా

అల్లు శిరీష్ లైన్లోకి వచ్చాడబ్బా

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో మెజారిటీ నిలదొక్కుకున్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం పెద్దగా ఎదుగుదల లేకుండా ఉండిపోయాడు. హీరోగా నిలదొక్కుకోవాలని చాలా ఏళ్ల నుంచి పోరాడుతున్నాడతను. కానీ ఫలితం లేకపోయింది. తొలి రెండు సినిమాలు ‘గౌరవం’. ‘కొత్త జంట’ నిరాశ పరిచాక ‘శ్రీరస్తు శుభమస్తు’ అతడికి ఊరటనిచ్చింది. ఈ విజయాన్ని ఉపయోగించుకుని ఎదుగుతాడనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. శిరీష్ తర్వాతి సినిమా ‘ఒక్క క్షణం’ అట్టర్ ఫ్లాప్ అయింది. శిరీష్ తిరిగి పూర్వపు స్థితికి వెళ్లిపోయాడు. ఇప్పుడతను ‘ఏబీసీడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

చడీచప్పుడు లేకుండా ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఇప్పటిదాకా సినిమా గురించి ఏ అప్ డేట్ ఇవ్వని చిత్ర బృందం నేరుగా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ టైటిల్ లోగోను రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని 2019, ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.  ‘ఏబీసీడీ’ చిత్రాన్ని సంజీవ్ అనే కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ఏబీసీడీ’కిది రీమేక్. మధుర శ్రీధర్ రెడ్డి.. యాష్ రంగినేని నిర్మాతలు. ఈ చిత్రం కోసం కన్నడ నుంచి జుదా శాందీ అనే ఓ యువ సంగీత దర్శకుడిని తీసుకొచ్చారు. శిరీష్ సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఫేమ్ రుక్సార్ ధిల్లాన్ నటిస్తోంది. ఈ చిత్రంలో శిరీష్‌కు స్నేహితుడిగా మాస్టర్ భరత్ నటిస్తుండటం విశేషం. మలయాళంలో దుల్కర్ నటించిన పాత్రలో శిరీష్ కనిపించనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English