కాస్టింగ్ కౌచ్‌పై మీనా ఏమందంటే..

కాస్టింగ్ కౌచ్‌పై మీనా ఏమందంటే..

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ఈ ఏడాది ఆరంభం నుంచి విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. చిన్న హీరోయిన్ల నుంచి స్టార్ల వ‌ర‌కు ఈ విష‌యంపై స్పందించారు. త‌మ అభిప్రాయాలు చెప్పారు. తాజాగా ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ మీనా సినీ ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపుల మాట్లాడింది. అంద‌రూ ఇప్పుడే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నార‌ని.. కానీ త‌మ రోజుల్లోనూ ఇది ఉంద‌ని ఆమె చెప్పింది.

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక విచారకరమైన అంశమని మీనా చెప్పింది. తమ కాలంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని.. కానీ తనకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని ఆమె తెలిపింది. వ‌క్ర బుద్ధి కలిగిన మగాళ్లు ఇకనైనా మారాలని ఆమె విన్న‌వించింది. ఒక మ‌హిళ‌ల‌తో ఇలా ప్ర‌వ‌ర్తించే ముందు.. తమకు కూడా భార్య, పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మీనా హిత‌వు ప‌లికింది.

ఇక త‌న కెరీర్ గురించి మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం క‌థానాయిక‌గా కొన‌సాగిన తాను ఒక‌ప్ప‌టి అగ్ర నటులందరితో నటించానని... కానీ ‘బొంబాయి’ హీరో అరవిందస్వామితో మాత్రం నటించలేకపోయానని మీనా అసంతృప్తి వ్య‌క్తంచేసింది. అలాగ‌ని అర‌వింద్ స్వామితో న‌టించే అవ‌కాశం రాకుండా ఏమీ లేద‌ని.. ఐతే కాల్షీట్ల‌ సమస్య కారణంగా కొన్ని అవ‌కాశాలు వదులుకున్నానని చెప్పింది. ఇక స్టార్ హీరో విజ‌య్‌తో తాను చాలా చిత్రాలు కమిటై కూడా నటించలేకపోయానని ఆమె తెలిపింది. ఐతే విజయ్‌తో నటించలేకపోయాననే లోటు తీర్చుకోవడానికే 'షాజహాన్’ సినిమాలో అత‌డితో క‌లిసి ఒక పాట‌లో డ్యాన్స్ చేశాన‌ని మీనా వెల్ల‌డించింది. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు