తమిళ ‘అర్జున్ రెడ్డి’కి హీరోయిన్ దొరికేసింది

తమిళ ‘అర్జున్ రెడ్డి’కి హీరోయిన్ దొరికేసింది

తెలుగులో గత ఏడాది సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‌కు ఒరిజినల్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహిస్తుండగా.. తమిళంలో విలక్షణ దర్శకుడు బాలా డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైపోయింది. కానీ హీరోయిన్ వేట మాత్రం ఆలస్యమైంది.

తెలుగులో షాలిని పాండే చేసిన పాత్రను తమిళంలో ఎవరు చేస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మేఘా చౌదరి అనే కొత్తమ్మాయి ధ్రువ్‌కు జోడీగా నటించనుంది. ఫొటోతో సహా ఆ అమ్మాయి వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

మేఘా ఇప్పటికే ఓ బెంగాలీ సినిమాలో నటించింది. ఆమె థియేటర్ ఆర్టిస్టు అని సమాచారం. మేఘా శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ పొందిందట. పదుల సంఖ్యలో అమ్మాయిల్ని పరిశీలించి చివరికి మేఘాను ఎంపిక చేశాడట బాలా. మరి తెలుగులో షాలిని లాగే ఈ అమ్మాయి కూడా తమిళ ప్రేక్షకుల మనసు దోస్తుందేమో చూడాలి. ‘పితామగన్’తో అతడికి తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టిన బాలా.. అతడి కొడుకును హీరోగా పరిచయం చేస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఆయన డైరెక్ట్ చేస్తున్న తొలి రీమేక్ మూవీ ఇది. విక్రమ్ కు సన్నిహితుడైన ఓ పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ధ్రువ్ పూర్తిగా అవతారం మార్చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు