కమాన్ బాయ్స్ అంటున్న అనుష్క

కమాన్ బాయ్స్ అంటున్న అనుష్క

ఐపీఎల్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఆల్రెడీ సన్ రైజర్స్ అండ్ చెన్నయ్ సూపర్ కింగ్స్ టాప్ ప్లేసులో ఉండటంతో.. ప్లే ఆఫ్ లో ఈజీగా ఛాన్సు కొట్టేశాయ్. కాని 3వ పొజిషన్లో కోలకతా, రాజస్థాన్, పంజాబ్ జట్లు పోటీపడుతున్నాయి. కాని ఆ మూడు జట్లనూ కొడితేనే.. కనీసం నాలుగవ స్థానం అయినా బెంగుళూరుకు దక్కుతుంది. అయితే అందరికి అవకాశాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాయిలే. ముఖ్యంగా బెంగుళూరుకు ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి. చెమటోడిస్తే గాని రేస్ లో నిలవలేదు. ఆడిన 12 మ్యాచుల్లో 5 మాత్రమే గెలవడంతో.. విరాట్ కోహ్లీ సేన అనుకున్నంతగా రాణింట్లేదని.. ఇప్పుడు వైఫ్‌ అనుష్క శర్మ స్టేడియంలో తెగ మెరుస్తూ వారిని ఎంకరేజ్ చేస్తోంది.

షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి స్టేడియంలో దర్శనమిస్తోంది. ఇక ప్రస్తుతం పోరాడాల్సిన డోస్ పెంచాలని అమ్మడు సోషల్ మీడియా నుంచి తన భర్త టీమ్ కు మద్దతు ఇస్తోంది. కమాన్ బాయ్స్ అంటూ.. లవ్ - బ్యాట్ - బెలూన్ సింబల్స్ తో అన్ని అంశాలను అర్థమయ్యేలా క్లియర్ గా చెప్పేసింది. అన్నింటికంటే గొప్పగా విరాట్ కోహ్లీ పేరుతో 18 నెంబర్  గల జెర్సీ ని ధరించి ఒక స్టిల్ ఇచ్చింది. ఆ టీ షర్టు చూస్తుంటే.. అది కొహ్లీ పాత టి షర్ట్ అని అర్దమవుతూనే ఉంది. పంజాబ్ తో గత రాత్రి జరిగిన మ్యాచ్ కు వెళుతూ.. అమ్మడు ఇలా ఎంకరేజ్ చేసిందిలే. విరుష్క జోడి అందరిని భలే ఆకట్టుకుంటుందని కామెంట్స్ కూడా బాగానే అందుతున్నాయి. ఇక ప్రస్తుతం అనుష్క శర్మ కొన్ని బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు