​గంట వ్యవధిలో పూరి వెర్సస్ వర్మ

​గంట వ్యవధిలో పూరి వెర్సస్ వర్మ

తమ కెరీర్లలో అత్యంత కీలకమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు గురు శిష్యులు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్. దశాబ్ద కాలంగా తన స్థాయికి ఏమాత్రం తగని సినిమాలతో తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తున్న వర్మ.. తనకు దర్శకుడిగా లైఫ్ ఇచ్కచిన అక్కినేని నాగార్జునతో ‘ఆఫీసర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆ చిత్రం మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంతకుముందు ‘ఆఫీసర్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు వర్మ. ఇప్పుడు ఈ చిత్ర టీజర్‌ను ఏప్రిల్ 9న ఉదయం 10 గంటలకు లాంచ్ చేయబోతున్నారు. దానికి గంట ముందే వర్మ శిష్యుడు పూరి తన కొత్త సినిమా ట్రైలర్‌తో ప్రేక్షకుల్ని పలకరించబోతుండటం విశేషం.

తన కొడుకు ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి ‘మెహబూబా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్ ఆల్రెడీ విడుదలైంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఏప్రిల్ 9న ఉదయం 9 గంటలకు ‘మెహబూబా’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. అంటే గంట వ్యవధిలో గురు శిష్యులు సోషల్ మీడియా వార్‌కు దిగుతారన్నమాట. మరి వీళ్లిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

ఇక గురు శిష్యుల సినిమాలు రెండు వారాల వ్యవధిలో థియేటర్లలోకి దిగబోతున్నాయి. ‘ఆఫీసర్’ రావడానికి రెండు వారాల ముందే మే 11న ‘మెహబూబా’ రిలీజవుతుంది. ఈ రెండు సినిమాలు విజయవంతం కావడం ఈ ఇద్దరు దర్శకులకూ చాలా కీలకం. మరి వారికి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలందిస్తాయో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు