ఎన్టీఆర్‌తో ఇలాగేనా.. త్రివిక్రమ్‌పై గుస్సా!

ఎన్టీఆర్‌తో ఇలాగేనా.. త్రివిక్రమ్‌పై గుస్సా!

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ ఎలా కనిపిస్తాడనే దానికి చిన్న టీజర్‌లా ఐపీఎల్‌ తెలుగు యాడ్‌ వీరిద్దరితోనే రూపొందింది. 'అజ్ఞాతవాసి'తో బాగా దెబ్బ తిన్న త్రివిక్రమ్‌ మంచి కసి మీద వుంటాడని, ఎన్టీఆర్‌ సినిమాలో డైలాగులు ఇరగ రాసేస్తాడని ఫాన్స్‌ నమ్ముతున్నారు. అయితే త్రివిక్రమ్‌ మాత్రం తనలో జ్యూస్‌ అయిపోయిందనే హింట్లు బలంగా ఇస్తున్నాడు. ఐపీఎల్‌ యాడ్‌లో కూడా నాసి రకం ప్రాస డైలాగులతో త్రివిక్రమ్‌ బాగా విసిగించాడు. ఈ యాడ్‌ చూసిన తారక్‌ అభిమానులకి కంగారు పట్టుకుంది. తారక్‌తో సినిమాకి ఆల్రెడీ మాటలు రాయడం పూర్తి చేసిన త్రివిక్రమ్‌ ఇదే ఫామ్‌లో అందులోను సంభాషణలు రాసి వుంటాడా అని అనుమాన పడుతున్నారు.

అయితే ఈ యాడ్‌ చేయడానికి త్రివిక్రమ్‌ అయిష్టంగానే వున్నా తారక్‌ ప్రోద్బలం మీద చేసాడట. ఎలాంటి కాన్సెప్ట్‌ ఇవ్వకుండా ముప్పయ్‌ సెకండ్లలో యాడ్‌ కావాలని అడిగితే ఇలా కానిచ్చేసాడట. కనుక బాగా ఆలోచించి రాసుకున్న తన కథ, మాటలకి, ఈ యాడ్‌లో అప్పటికప్పుడు అల్లిన దానికి ముడి పెట్టడం భావ్యం కాదేమో. కాకపోతే ఈ యాడ్‌ వల్ల అసలే అనుమానాలున్న త్రివిక్రమ్‌ కరంట్‌ మైండ్‌ సెట్‌పై మరిన్ని అనుమానాలు స్టార్ట్‌ అయ్యాయి. ఎన్టీఆర్‌ సినిమాతో త్రివిక్రమ్‌ చాలా నోళ్లే మూయించాల్సి వుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు