ఫ్లాప్ సినిమాను దించుతున్నావా శిరీషూ..

ఫ్లాప్ సినిమాను దించుతున్నావా శిరీషూ..

అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న ఫాలోయింగ్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అక్కడి స్టార్ హీరోల సినిమాల స్థాయిలోనే అతడి చిత్రాలు కూడా కేరళలో పెద్ద ఎత్తున రిలీజవుతుంటాయి. భారీ వసూళ్లు రాబడుతుంటాయి. అన్నకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు గత ఏడాది అల్లు శిరీష్ మలయాళంలో ఒక సినిమా కూడా చేశాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా పేరు ‘1971 బియాండ్ బార్డర్’. ఇందులో శిరీష్ కీలక పాత్ర చేశాడు. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటే తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. మేజర్ రవి రూపొందించిన ఈ చిత్రం గత ఏప్రిల్లోనే మలయాళంలో రిలీజైంది.

కానీ ఈ చిత్రానికి అక్కడ ఆశించిన స్పందన రాలేదు. సినిమా ఫ్లాప్ అయింది. అల్లు శిరీష్ గురించి అక్కడ పెద్దగా చర్చ కూడా జరగలేదు. ఆ తర్వాత తెలుగు వెర్షన్ గురించి పట్టించుకోనే లేదు. అక్కడ ప్లాప్ అయింది కాబట్టి ఇక్కడ రిలీజ్ చేయడం కూడా వృథా అనుకున్నారేమో అని జనాలు సైలెంటైపోయారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి పాత టైటిల్ మార్చేసి.. ‘యుద్ధ భూమి’ అనే కొత్త టైటిల్ పెట్టి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. కొత్తగా పోస్టర్లు కూడా వదిలారు. అల్లు అర్జున్ ఆర్మీ నేపథ్యంలో ‘నా పేరు సూర్య’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మాంచి క్రేజ్ ఉంది. ఇదే సమయంలో తమ్ముడు నటించిన ఆర్మీ మూవీని రిలీజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారేమో. కానీ ‘శ్రీరస్తు శుభమస్తు’తో వచ్చిన కొంచెం మార్కెట్ కూడా ‘ఒక్క క్షణం’ దెబ్బకు పోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు శిరీష్. ఈ పరిస్థితుల్లో ‘యుద్ధభూమి’ ఏమాత్రం జనాల్ని ఆకర్షిస్తుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు