హీరో అంటే నాగశౌర్యలా ఉండాలమ్మా!

హీరో అంటే నాగశౌర్యలా ఉండాలమ్మా!

సక్సెస్‌ రావడం కష్టమైపోతే ఎవరైనా ఏం చేస్తారు? తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ తమకింతే ప్రాప్తం అనుకుని ఊరుకుంటారు. కానీ సినీ ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా, అరడజనుకి పైగా సినిమాల్లో నటించిన అనుభవంతో తన సక్సెస్‌ని తానే రాసుకున్నాడు నాగశౌర్య. ఫ్లాపుల్లో వున్న టైమ్‌లో తనతో సినిమా తీయడానికి నిర్మాతలు వెనుకాడుతున్న టైమ్‌లో నాగశౌర్య చాలా ధైర్యం చేసాడు.

ఛలో కథని నమ్మి, ఇది ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుందని భావించి తానే నిర్మాత అవతారం ఎత్తాడు. తన కుటుంబ సభ్యులకే నిర్మాణ వ్యవహారాలు అప్పగించి ఛలో చిత్రాన్ని క్వాలిటీతో నిర్మించాడు. అంతే కాకుండా సినిమాకి క్రేజ్‌ తీసుకు రావడానికి ఒక ప్రణాళిక ప్రకారం ప్రమోషన్లు చేసి సక్సెస్‌ అయ్యాడు. బయ్యర్లు దొరకడంతో ఎవరైనా విడుదల చేయడం కోసం ఎదురు చూడాల్సిన అవసరం పడలేదు. పోటీగా రవితేజ సినిమా వున్నా కానీ జంకకుండా తన చిత్రాన్ని విడుదల చేసాడు. శౌర్య నమ్మకమే నిజమైంది.

ఛలో ఘన విజయాన్ని సాధించింది. అతని నుంచి మిగతా యువ హీరోలు స్ఫూర్తి పొందాలి. మంచి కథ కోసం అన్వేషించి అవసరం అనుకుంటే తమ అదృష్టాన్ని తామే వెతుక్కోవడానికి స్వయంగా నిర్మాతలుగా కూడా మారాలి. ఛలో సక్సెస్‌తో ఇప్పుడు మళ్లీ నిర్మాతలు శౌర్య కోసం క్యూ కడుతున్నారు. ఇకపై తనకి నచ్చిన సినిమాలు తీసుకోవడానికి తన సొంత బ్యానర్‌ ఎలాగో వుంది. కీపిటప్‌ శౌర్యా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు