చైనా ‘ఓపెన్’ సూపర్ స్టార్ అమీర్

చైనా ‘ఓపెన్’ సూపర్ స్టార్ అమీర్

ఈ ఓపెన్ సూపర్ స్టార్ ఏంటి అని సందేహం కలుగుతోందా? అమీర్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తూ స్వయంగా నిర్మించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమా.. చైనాలో అమీర్ ఖాన్ రేంజ్ ఏంటో చూపిస్తోంది. ఆయన అక్కడ తిరుగులేని సూపర్ స్టార్ అయిపోయాడని ఈ సినిమాతో ఓపెన్ అయిపోయింది. ‘దంగల్’ ఏదో మ్యాజికల్ గా అలా ఆడేసిందని.. అన్ని సినిమాలకూ ఇలాంటి వసూళ్లు ఉండవని అన్నారప్పుడు. కానీ అమీర్ బ్రాండుతో వచ్చిన చిన్న సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సైతం చైనాలో చితగ్గొట్టేస్తోంది. కేవలం 10 రోజుల్లోనే ఈ చిత్రం చైనాలో రూ.415 కోట్లు కొల్లగొట్టడం విశేషం.

రెండో వారాంతంలోని మూడు రోజుల్లో ‘సీక్రెట్ సూపర్ స్టార్’కు రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. సినిమా విడుదలైన తొమ్మిదో రోజు అక్కడ ఈ చిత్రానికి రూ.52 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయంటే దీని హవా ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ ఇండియన్స్ మాదిరే అమీర్ సినిమా అంటే ఏదో ప్రత్యేకత ఉంటుందనే భరోసా చైనా ప్రేక్షకుల్లో కనిపిస్తుండటం విశేషం. అమీర్ గెస్ట్ రోల్ చేసిన సినిమా అయినా సరే.. భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగి ప్రి సేల్స్ కళ్లు చెదిరే రేంజిలో వచ్చాయి. ఒక చిన్న అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి తొలి రోజే రూ.43 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ పది రోజుల్లోనే రూ.400 కోట్ల మార్కును దాటింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.600 కోట్ల మార్కును దాటుతుందని భావిస్తున్నారు. దీని బడ్జెట్ రూ.50 కోట్ల లోపే కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు