పిల్లా మంచి బందోబస్తుగుందే!

పిల్లా మంచి బందోబస్తుగుందే!

'చమ్మక్‌ చల్లో' చిత్రంతో పరిచయమైన క్యాథరీన్‌ థెరీసా దాంతో సాధించిందేమీ లేదు. ఇన్‌ఫాక్ట్‌ ఆ సినిమాతో ఆమె అస్సలు ఎవరికీ రిజిష్టర్‌ కాలేదు. కానీ ఆమెలో స్టార్‌ అయ్యే స్టఫ్‌ ఉందని ఇండస్ట్రీ ఆల్రెడీ గుర్తించేసింది. అందుకే సాధించిందేమీ లేకపోయినా కానీ పెద్ద సినిమాలు కట్టబెట్టేస్తోంది.

అల్లు అర్జున్‌ సరసన 'ఇద్దరమ్మాయిల్లో' ఒకరిగా నటిస్తున్న క్యాథరీన్‌ 'పైసా'లో కూడా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈమె టాప్‌ లీగ్‌కి చేరుతుందని ఆమెని చూస్తున్న వారు కితాబులిస్తున్నారు. తెలుగు తెరపై నేచురల్‌ బ్యూటీస్‌ ఎప్పుడూ సక్సెస్‌ అయ్యారు. వారికి హిట్స్‌ లేట్‌గా వచ్చినా కానీ హీరోయిన్స్‌గా టాప్‌ రేంజ్‌కి వెళ్లగలిగారు.

అలాగే క్యాథరీన్‌ కూడా టాప్‌ హీరోయిన్‌ అయిపోతుందని ఆమె గ్లామర్‌కి ఫిదా అవుతున్న వారు జోస్యం చెబుతున్నారు. పిల్ల మంచి బందోబస్తుగా ఉంది కాబట్టి ఇక ఆమె ఎంత జబర్దస్త్‌ చేస్తుందనేది రానున్న రోజుల్లో చూడాలంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు