రొజా చుట్టూ పవన్ ఫ్యాన్సే.. ఏమవుతుందో!!

రొజా చుట్టూ పవన్ ఫ్యాన్సే.. ఏమవుతుందో!!

గత రాత్రి జరిగిన ఒక టీవి ఛానల్ డిస్కషన్లో మాజీ హీరోయిన్ కమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా రెడ్డి చేసిన వ్యాఖ్యల సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ కు పక్కలేస్తున్నావా అంటూ ఆమె ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌ ను అడగటం సంచలనం రేపింది. అవతల ప్రక్కన బండ్ల చాలా సెటైరికల్ గా మీరు 'గోల్డెన్ లెగ్'లే అన్నప్పటికీ.. రోజా మాత్రం పక్కలూ అది అదీ అంటూ తన స్థాయి నుండి దిగజారిపోయి కామెంట్లు చేయడం గమనార్హం. ఇప్పుడు దీని గురించి ఒక డిస్కషన్ ఏంటంటే.. అసలు చుట్టూతా పవన్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు రోజా ఈ కామెంట్లను ఎలా సమర్ధించుకుంటుంది అనే.

నిజానికి ఇన్నాళ్ళూ రోజా ఇటు చిరంజీవిని అటు పవన్ ను ఎన్ని కామెంట్లు అన్నా కూడా.. అవన్నీ కేవలం పొలిటికల్ గా చేసిన కామెంట్లేనని నాగబాబు గారికి తెలుసు అంటూ కవర్ చేసేది. ఎందుకంటే ఈమెకు కొత్త స్టార్డమ్ ఇచ్చిన జబర్ దస్త్ ప్రోగ్రామ్ లో నాగబాబు చీఫ్‌ జడ్జ్. ఇప్పుడిక హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ వంటి హ్యాపెనింగ్ జబర్ దస్త్ కమెడియన్లు కూడా పవన్ కు వీరాభిమానులే. ఇలా పక్కలేస్తున్నావా అంటూ బండ్ల గణేష్‌ పై చేసిన కామెంట్ గురించి ఇప్పుడు రోజా వారికి ఏమని చెబుతుంది? ఒకవేళ వారు ఇదే విషయం మనస్సులో పెట్టుకుని రాజేష్‌ సుత్తి తరహాలో కూజా రెడ్డి అని ఏదన్నా సెటైర్ వేస్తే రోజా తట్టుకుంటుందా? చుట్టూతా పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఉన్న వాతావరణంలో ఆమె ఏం చెబుతుంది? అలాగే ఆమె ఏం చెబితే ఆ ఫ్యాన్స్ చల్లారతారు? అంటూ ఆలోచనలు చేస్తున్నారు ఆడియన్స్.

చూస్తుంటే.. రోజా నోటిదురుసు చాలా దూరం తీసుకెళ్లేలా ఉంది. తీసుకెళ్లి ఆమెను ఆగాథంలో కూడా పడేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో దుర్బాషలాడినందుకు ఒకసారి రోజా శిక్షను ఎదుర్కొంది. ఇప్పుడు ఇంత ఓపెన్ గా అలా ఒక హ్యాపెనింగ్ రాజకీయ నాయకుడిపై కామెంట్లు చేస్తే.. అంత తేలికగా వాటిని జనాలు మర్చిపోతారా? ఎంత జగన్ ఫ్యాన్ అయితే మాత్రం.. ఇలా బూతులూ వావి వరసలూ లేని మాటలా ప్రయోగించేది? అంటున్నారు పవన్ అభిమానులు. చూద్దాం ఏమవుతుందో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు