బ్లాక్‌బస్టరే... ఎనీ డౌట్స్‌?

బ్లాక్‌బస్టరే... ఎనీ డౌట్స్‌?

ఎన్టీఆర్‌తో హరీష్‌ శంకర్‌ తీస్తున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంపై ఇప్పుడు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది కొలవడానికి ఏ మీటర్లూ సరిపోవు. ఒకే ఒక్క డైలాగ్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. గబ్బర్‌సింగ్‌ చిత్రంపై కూడా సింగిల్‌ డైలాగ్‌తో ఎక్స్‌పెక్టేషన్స్‌ బిల్డ్‌ చేసిన హరీష్‌ శంకర్‌ మరోసారి తన టాలెంట్‌ చూపించాడు.

ఎన్టీఆర్‌ ఫాన్స్‌ ఇన్‌స్టంట్‌గా కనెక్ట్‌ అయ్యే డైలాగ్‌తో అదరగొట్టాడు. దీంతో ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌ అవడం ఖాయమని బిజినెస్‌ వర్గాల నుంచి ప్రతి ఒక్కరూ ఫిక్స్‌ అయిపోయారు. హీరోల బలాలకి తగ్గట్టు తన క్యారెక్టర్లు డిజైన్‌ చేసుకునే హరీష్‌ శంకర్‌ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ని చాలా యారొగెంట్‌గా చూపిస్తున్నాడు.

టైటిల్‌ సాఫ్ట్‌గా ఉన్నా కానీ ఎన్టీఆర్‌ సినిమాలో ఉండాల్సిన పవర్‌ అంతా దీంట్లో నింపుతున్నాడు. బాద్షాగా కేవలం ఓపెనింగ్స్‌ మాత్రం సాధించి సరిపెట్టిన ఎన్టీఆర్‌ ఈ చిత్రంతో రికార్డుల్ని కూడా తిరగరాసేస్తాడని ఫాన్స్‌కి నమ్మకం బలపడిపోయిందిపుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు