రాస్కోరా నాని.. ఇంకో మిలియన్

రాస్కోరా నాని.. ఇంకో మిలియన్

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో కూడా నాని ఫాలోయింగ్ సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. అతడి కొత్త సినిమా 'నిన్ను కోరి'కి 500 ప్రిమియర్స్ పడ్డాయంటేనే అతడి ఊపు అక్కడెలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది స్టార్ హీరోల సినిమాలకు కూడా లేని హంగామా.. హైప్ నాని సినిమాలకు అక్కడ కనిపిస్తోంది. పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే కాదు.. ప్రిమియర్లతో మంచి వసూళ్లు కూడా రాబట్టింది 'నిన్ను కోరి'.

నాని కెరీర్లోనే అత్యధికంగా ప్రిమియర్లతోనే 1.6 లక్షల డాలర్లు కొల్లగొట్టింది 'నిన్ను కోరి'. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమా కావడంతో వీకెండ్లో అదిరిపోయే వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. 6-7 లక్షల డాలర్ల మధ్య వీకెండ్ వసూళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఫుల్ రన్లో ఈ చిత్రం ఈజీగానే మిలియన్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

'భలే భలే మగాడివోయ్' దగ్గర్నుంచి నాని సినిమాలన్నీ అమెరికాలో అదరగొడుతున్నాయి. 'భలే భలే..' అక్కడ 1.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. ఐతే అన్నీ కూడా మిలియన్ మార్కుకు చేరువగా వస్తున్నాయి కానీ.. ఆ మైలురాయిని దాటట్లేదు. 'నిన్ను కోరి' కచ్చితంగా మిలియన్ మార్కును అందుకుంటుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

కాకపోతే ఇది పూర్తిగా క్లాస్ టచ్ ఉన్న ఇంటెన్స్ లవ్ స్టోరీ కావడంతో మాస్ సెంటర్లలో పెద్దగా ఆడే అవకాశం లేదు. ఎ సెంటర్లలో మాత్రం మంచి వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఐతే ఓవరాల్‌గా సినిమా హిట్ కేటగిరిలో చేరడం మాత్రం పక్కా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English