ఒక మేకోవర్.. ఎంత మ్యాజిక్ చేసిందో?

ఒక మేకోవర్.. ఎంత మ్యాజిక్ చేసిందో?

సంపత్ నంది చివరి సినిమా 'బెంగాల్ టైగర్' ఏదో అలా సోసోగా ఆడేసింది. పెట్టుబడి.. రాబడి చూసుకుంటే అది హిట్టేమీ కాదు. ఇక హీరో గోపీచంద్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అతడి చివరి సినిమా 'సౌఖ్యం' పెద్ద డిజాస్టర్ అయింది. తర్వాత అతను చేసిన 'ఆక్సిజన్' అడ్రస్ లేకుండా పోయింది. 'ఆరడుగుల బుల్లెట్' సంగతీ తెలిసిందే.

ఇలాంటి తరుణంలో సంపత్-గోపీచంద్ కలిసి చేసిన సినిమా 'గౌతమ్ నంద' మాత్రం అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ బజ్ కనిపిస్తోంది ట్రేడ్ వర్గాల్లో. 'గౌతమ్ నంద' రూ.30 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లుగా చెబుతున్నారు. దిల్ రాజు లాంటి వాడు రూ.6 కోట్లకు పైగా పెట్టి నైజాం హక్కులు కొనడం.. ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని రూ.5.5 కోట్లకు అమ్మడం అంటే మాటలు కాదు.

ఈ సినిమాపై ఇలాంటి బజ్ రావడానికి కారణమేంటి అంటే.. లుక్ విషయంలో గోపీచంద్ మేకోవరే అని చెప్పాలి. ఇప్పటిదాకా ఏ సినిమాలో లేని విధంగా చాలా స్టైలిష్ గా తయారయ్యాడు గోపీ ఈ సినిమా కోసం. ఆ హేర్ స్టైల్.. గడ్డం.. అతడి ఔట్ ఫిట్.. అన్నీ కూడా చాలా కొత్తగా.. స్టైలిష్ గా అనిపించాయి. ఈ సినిమాకు పెట్టిన టైటిల్.. దాన్ని డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకున్నాయి.

ఫస్ట్ లుక్ తోనే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలిగించాడు సంపత్. తర్వాత టీజర్ తోనూ మెప్పించాడు. దీంతో ఒక్కసారిగా ట్రేడ్ వర్గాల్లో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. క్రేజీ బిజినెస్ ఆఫర్లతో సినిమాను సొంతం చేసుకున్నారు. మొత్తానికి ఒక స్లైలిష్ మేకోవర్ అన్నది సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో చెప్పడానికి 'గౌతమ్ నంద' రుజువుగా నిలిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English