కోస్తాంధ్ర బెల్ట్‌ మొత్తం మోత

కోస్తాంధ్ర బెల్ట్‌ మొత్తం మోత

బాహుబలి రికార్డులు కొట్టడం కాదు కదా, కనీసం ఆ ఆలోచన రావడానికి కూడా భయపడే లెవల్లో బాహుబలి 2 విధ్వంసం సాగుతోంది. మొదటి వారం ఊపు మీద ఆడేసిందని అనుకున్నా, రెండవ వారంలో ఈ చిత్రానికి వస్తోన్న వసూళ్లు చూస్తుంటే, అసలు ఎక్కడ ఆగుతుంది అనే అనుమానం కలగక మానదు. నైజాం, సీడెడ్‌లో కంటే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈ చిత్రం చేస్తోన్న సంచలనాలకి జనం అవాక్కయిపోతున్నారు.

కోస్తాలోని అన్ని జిల్లాల్లో పది కోట్లకి పైగా షేర్‌ తెచ్చుకున్న తొలి చిత్రంగా 'బాహుబలి 2' రికార్డులకి ఎక్కింది. కృష్ణా జిల్లాలో కూడా పది కోట్ల లాంఛనం పూర్తయిపోవడంతో కోస్తా బెల్ట్‌ మొత్తం బాహుబలికి దాసోహమైపోయింది. సోమవారం వసూళ్లు చూస్తే ఇది ఇప్పట్లో ఆగేది లేదని, అన్ని జిల్లాల్లోను కనీసం మరో మూడు కోట్ల షేర్‌ అయినా వస్తుందని ట్రేడ్‌ అంచనా వేస్తోంది.

ఇప్పటికే అన్ని ఏరియాల్లోను బ్రేక్‌ ఈవెన్‌ అయిన ఈ చిత్రంతో థర్ట్‌ పార్టీల వాళ్లు రికవర్‌ అవుతారా లేదా అనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. కానీ ఫైనల్‌గా ఓవర్‌ఫ్లోస్‌ కూడా వచ్చేలాగున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రానికి రెండు వందల కోట్ల షేర్‌ ఖాయమని అంటోన్న నేపథ్యంలో ఇక రికార్డుల గురించి మిగతా సినిమాల వాళ్లు మాట్లాడుకోకపోతేనే పద్ధతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు