థియేటర్లు వెలవెల.. విలవిల

థియేటర్లు వెలవెల.. విలవిల

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత స్లంప్‌ను ఎదుర్కొంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు. ఈ నెల ఆరంభం నుంచి థియేటర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. అందులోనూ గత రెండు వారాల నుంచి అయితే పరిస్థితి దయనీయంగా ఉంది. గత రెండు వారాంతాల్లో పదికి పైగా సినిమాలు రిలీజయ్యయాయి కానీ వాటిలో ఏవీ కూడా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోయాయి.
తమిళ డబ్బింగ్ సినిమాలు 16.. నగరం మాత్రం వీటిలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ వాటికి కూడా కలెక్షన్లు అంతంతమాత్రమే. ఈ రెండు సినిమాలకు థియేటర్లు చాలా తక్కువ ఇచ్చారు. ఈ సినిమాలు బాగున్నాయని టాక్ వచ్చినా.. దగ్గర్లో చూద్దామంటే థియేటర్లు కనిపించకపోవడంతో జనాలు నిరాశ చెందుతున్నారు. సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమాలు పెద్దగా కనిపించడం లేదు. ఉన్న థియేటర్లలో కూడా కలెక్షన్లు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక పోయిన వారం వచ్చిన తెలుగు సినిమాలు ‘చిత్రాంగద’.. ‘లక్ష్మీబాంబు’.. ‘ఆకతాయి’ వీకెండ్ అవ్వగానే అడ్రస్ లేకుండా పోయాయి.

ఈ వారం వచ్చిన నేనోరకం, మా అబ్బాయి సినిమాల పరిస్థితి కూడా అలాగే తయారైంది. సింగిల్ స్క్రీన్లలో సైతం రెండు షోలు ఒక సినిమాను.. ఇంకో రెండు షోలు మరో సినిమాను నడిపిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు. వస్తున్న కలెక్షన్లు థియేటర్ల మెయింటైనెన్స్‌కు కూడా సరిపోయేలా లేవని ఆవేదన చెందుతున్న ఎగ్జిబిటర్లు. కొత్త సినిమాల పరిస్థితి దయనీయంగా ఉండటంతో కొన్ని చోట్ల నెలన్నర కిందట విడుదలైన ‘నేను లోకల్’ సినిమాను మళ్లీ వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలే పరీక్షల సీజన్.. పైగా ఆసక్తి రేకెత్తించని చిన్న సినిమాలు.. దీంతో థియేటర్లు వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో నాలుగు రోజుల్లో ‘కాటమరాయుడు’ వచ్చాక కానీ థియేటర్లకు కళ వచ్చేలా లేదు. ఐతే లుగు రోజులు బండి నడవడం చాలా కష్టంగానే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు