సమంత అంత టార్చర్‌ అనుభవించిందా?

సమంత అంత టార్చర్‌ అనుభవించిందా?

సినీ తారలకి లేని సుఖాలు వుండవని, వాళ్లు కోరుకున్నదల్లా కాళ్లముందుకి వచ్చి పడిపోతుందని అనుకుంటాం. అయితే తమకీ కష్టాలు, కన్నీళ్లు వుంటాయని సమంత చెబుతోంది.

తన జీవితంలో చాలా చేదు అనుభవాలు చవిచూసానని, జీవితమంటే అంతా ఆనందమే అనుకుంటోన్న టైమ్‌లో తనకి ఊహించని కష్టాలు వచ్చాయని, కష్టాలంటే అలా చెప్పకుండానే వస్తాయని అప్పుడే తెలిసిందని, ఆ ఒడిదుడుకుల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని, అయితే అలాంటి సమయంలో నేర్చుకున్న పాఠాలే మనిషిని తీర్చిదిద్దుతాయని, అప్పుడు వచ్చిన మెచ్యూరిటీతోనే జీవితంలో సంతోషంగా వున్నానని, ప్రస్తుత ఫేజ్‌ని పరిపూర్ణంగా ఎంజాయ్‌ చేస్తున్నానంటూ సమంత ఇన్‌డైరెక్టుగా తన ప్రేమ, పెళ్లి గురించి ప్రస్తావించింది. అయితే సమంత అంతగా కష్టపడిందెపుడు?

జీవితంలో అంతా ఆనందమే అనుకుంటూ వుండగా కష్టమెదురైందని ఆమె అంటోంది. అంటే హీరోయిన్‌గా సక్సెస్‌ అయిన తర్వాతే ఆ సమస్యలు వచ్చాయని ఆమె మాటలని బట్టి అర్థమవుతోంది. దీనినిబట్టి ఆమె మాట్లాడుతున్నది హీరో సిద్ధార్థ్‌తో తన ప్రేమ వ్యవహారం గురించేననిపిస్తోంది. మరి సమంతని అంతగా ఏడిపించి, ఆ స్థాయిలో సిద్ధార్థ్‌ ఏం ఇబ్బంది పెట్టాడో ఏమిటో వాళ్లిద్దరికే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు