అందర్లోకి ఎన్టీఆర్ కామెంటే హైలైట్

అందర్లోకి ఎన్టీఆర్ కామెంటే హైలైట్

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ చూసి స్పెల్ బౌండ్ అయిపోయాయరు తెలుగు సినీ ప్రేక్షకులు. వేరే సినిమాల గురించి ఎప్పుడూ స్పందించని వాళ్లు సైతం ఈ ట్రైలర్ చూసి ఫిదా అయిపోయి.. తమ స్పందన తెలియజేశారు. ఐతే అందర్లోకి అత్యంత ఆసక్తి రేకెత్తించిన రెస్పాన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ దే.

కొంత కాలంగా బాలయ్య-ఎన్టీఆర్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. ఇద్దరూ ఒకరి సినిమాల గురించి ఇంకొకరు మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ చూసి.. తన స్పందన తెలియజేయడం ఆసక్తి రేకెత్తించింది.

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఫినామినల్ అని.. బాబాయి తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని.. బాలయ్యను ఇంతకుముందెన్నడూ లేని విధంగా చూపించినందుకు క్రిష్ కు కుడోస్ అని అన్నాడు ఎన్టీఆర్. మరోవైపు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా ఈ ట్రైలర్ పై స్పందించాడు. ‘దేశం మీసం తిప్పుదాం.. గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్లో బాబాయి అద్భుతంగా కనిపిస్తున్నారు.. క్రిష్ కు కుడోస్’’ అని ట్వీట్ చేశాడు కళ్యాణ్ రామ్.

మరోవైపు బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సైతం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ అద్భుతం అని.. ఈ విజువల్స్ గొప్పగా ఉన్నాయని ట్వీట్ చేశాడు. ఇంకా ఎందరో ప్రముఖులు ఈ ట్రైలర్ ను ఆకాశానికెత్తేశారు. ఐతే ఎంతమంది ఎంత గొప్ప కామెంట్లు చేసినా.. ఎన్టీఆర్ బాబాయి సినిమా ట్రైలర్ గురించి స్పందించడమే హాట్ టాపిక్ అయింది.

గౌతమీపుత్ర శాతకర్ణి అనే హ్యాష్ ట్యాగ్ కొడితే.. ఎన్టీఆర్ కామెంటే టాప్‌లో కనిపిస్తోంది. దీన్ని బట్టే అబ్బాయి-బాబాయి సంబంధాలపై జనాలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ బాబాయిని ఉద్దేశించి ఇలా కామెంట్ చేయడం నందమూరి అభిమానుల్లో సంతోషం నింపుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు