మహిళలు డిమాండ్‌ చేస్తున్నారా ...నాయనా

మహిళలు డిమాండ్‌ చేస్తున్నారా ...నాయనా

సంక్రాంతి రేసులో చివరగా వచ్చిన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఐతే ఆఖర్లో వచ్చినా సోగ్గాడి జోరు మాత్రం తక్కువగా ఏమీ లేదు. మంచి టాక్‌తో సూపర్‌ హిట్‌ అయ్యేలా కనిపిస్తోంది 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ సంతోషంలో సక్సెస్‌ మీట్‌ పెట్టిన నాగార్జున తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇంత పోటీలోనూ తన సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ అద్బుతమన్నాడు.

''సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటంతో 'సోగ్గాడే చిన్నినాయనా'ను 450 థియేటర్లలోనే రిలీజ్‌ చేయగలిగాం. వరుసగా మూడు రోజుల్లో రూ.5 కోట్ల చొప్పున షేర్‌ వచ్చింది. రెండో వారానికి థియేటర్ల సంఖ్య 600కు పెరుగుతోంది. మహిళల తమ కోసం స్పెషల్‌ షో వేయమని డిమాండ్‌ చేస్తున్నారు. అచ్చమైన సంక్రాంతి సినిమాను రూపొందించాం. జనాలు ఈ స్థాయిలో ఆదరిస్తుండటం ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంది'' అని నాగ్‌ చెప్పాడు.

సినిమాలు చూడ్డం తగ్గించేసిన వాళ్లు కూడా 'సోగ్గాడే చిన్నినాయనా' మీద ఆసక్తి చూపిస్తున్నారని నాగ్‌ చెప్పాడు. ''అప్పట్లో నాన్నగారు, ఎన్టీఆర్‌ గారు నటించిన సినిమాల్ని జనాలు ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్లి చూసొచ్చేవారట. ఇప్పుడు జనాలు బస్సులు, ట్రాక్టర్లలో వెళ్లి నా సినిమా చూసి వస్తున్నారని తెలిసింది. సినిమాలు చూడ్డం తగ్గించేసిన వాళ్లు కూడా సినిమా చూస్తున్నారట. ఈ రెస్పాన్స్‌ నాలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది'' అని నాగ్‌ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు