హైదరాబాద్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, శ్రీహాన్ సినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన కొవిడ్ వారియర్స్ క్రికెట్ మ్యాచ్‌లో డాక్టర్స్ టీమ్ విజేతగా నిలిచింది.
కరోనా కష్టకాలంలో నిరంతరం సేవ చేసిన డాక్టర్లకు, సివిల్ సర్వీస్ అధికారులకు వీరితో పాటు సినీ నటులకు మానసిక, శారీరక ఉపశమనం కోసం ఉద్దేశించిన క్రికెట్ మ్యాచ్ శంకర్‌పల్లిలోని జన్వాడ వద్ద గల ఏక్తా స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ హాజరై వారితో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు.
అనంతరం విజేతలకు బహుమతులతో పాటు నగదు అందజేశారు.
డాక్టర్స్ టీమ్‌కు డాక్టర్ కార్తికేయ కెప్టెన్‌గా, సినీ హీరోల టీమ్‌కు హీరో తరుణ్ కెప్టెన్‌గా, సివిల్ అధికారుల టీమ్‌కు సుమిత్ శర్మ ఐఆర్‌ఎస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. మ్యాచ్‌కు ముందు మూడు జట్ల సభ్యులతో కలిసి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.
క్రికెట్ మ్యాచ్‌లకు సమన్వయ కర్తలుగా సుబ్బరాజు, చంద్రప్రియ సుబుద్ధి, డాక్టర్ ధీరజ్, అడిషనల్ డీసీపీ సందీప్, రాఘవ వ్యవహరించారు. బహుమతిగా వచ్చిన రూ.4 లక్షల్లో రూ.2 లక్షలను.. శాఖాహారాన్ని ప్రోత్సహించే విధంగా ప్రచారం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య శ్రీనివాస్ బృందానికి అందజేశారు.
This post was last modified on March 3, 2021 1:26 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…