అంచనాలు నిజమయ్యాయి. లెక్క వేసుకున్నట్లే.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ సోదరి వాద్రా ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ఉంది. ఆమె ఎన్నికల బరిలోకి దిగనున్నట్లుగా మంగళవారం పార్టీ అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో ఉప ఎన్నికల జరిగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయంతో గాంధీ కుటుంబానికి చెందిన మరో వారసురాలు ఎన్నికల బరిలోకి దిగినట్లైంది. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి ప్రియాంక దిగటం ఇదే తొలిసారి. ఈ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేయటం.. రెండు స్థానాల్లోనూ విజయం సాధించటం తెలిసిందే. కేరళ రాష్ట్రంలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే.
రాయబరేలీతో పోలిస్తే వయనాడ్ ను వదులుకోవటమే మంచిదన్న నిర్ణయాన్ని తీసుకున్న కాంగ్రెస్.. అందుకుతగ్గట్లే తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో.. వయనాడ్ ను వదులుకున్న రాహుల్ కు ప్రత్యామ్నాయంగా వేరే వారిని బరిలోకి దింపే కన్నా.. రాహుల్ సోదరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వయనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబం మీద వారికున్న అభిమానం అంతా ఇంతా కాదు.
ఈ క్రమంలో ప్రియాంక గెలుపు పెద్ద కష్టమైనది కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. వయనాడ్ లో ప్రియాంక గెలుపొందితే.. ఆమె తొలిసారి లోక్ సభలో అడుగు పెట్టనున్నారు. అదే జరిగితే.. మరో అరుదైన సీన్ పార్లమెంటులో చోటు చేసుకోనుంది. ముగ్గురు గాంధీలు ఒకే సందర్భంలో పార్లమెంట్ హౌస్ లో కనిపిస్తారు. ఇప్పటివరకు అలాంటి సీన్ ఎప్పుడూ చోటు చేసుకున్నది లేదు. దీంతో ప్రియాంక గెలుపు కాంగ్రెస్ కు అత్యంత కీలకం కానుంది.
రాహుల్ ను అభిమానించి.. ఆరాధించిన వయనాడ్ ప్రజలను.. ఆ ఓటర్లను దూరం చేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. అందుకే తమ కుటుంబానికి చెందిన వ్యక్తిని రాహుల్ కు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారు. తొలిసారి ప్రియాంక ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తుది ఫలితంపై బోలెడంత ఆసక్తి నెలకొంది. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 16, 2024 10:53 am
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…