దేశవ్యాప్తంగా పుంజుకుంటున్నామని.. మోడీకి చెక్ పెడుతున్నామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించనంత స్థాయిలో దిగజారిపోయింది. తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ప్రధానంగా హర్యానాలో అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు.
అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంటుందని అనుకున్నారు. కానీ హర్యానాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది.
అదేవిధంగా జమ్మూకాశ్మీర్ లో కూడా 12 స్థానాల నుంచి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాలకు పడిపోయింది. ఈ ప్రభావం కేవలం ఆ రెండు రాష్ట్రాల మీదే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై పడుతుందనేది పరిశీలకుల అంచనా.
ప్రస్తుతం గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారాన్ని అందిపుచ్చుకునేందుకు చేయని ప్రయత్నం కూడా లేదు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహం బిజెపి నాయకుల సహకారం కారణంగా దేశవ్యాప్తంగా ఆ పార్టీ విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీంతో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితి స్పష్టం అవుతుంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ కనీసం నాలుగైదు రాష్ట్రాల్లో కూడా లేకపోవడం ఉన్న రాష్ట్రాల్లో కూడా బొటాబొటి సంఖ్యలో సీట్లు తెచ్చుకోవడం వంటివి ఆ పార్టీకి ప్రమాదకరంగా పరిణమించాయి.
తెలంగాణలో చూసుకుంటే కేవలం 64 స్థానాల్లో మాత్రమే విజయం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మార్కులతోనే కొనసాగుతోంది.
ఏపీలో పార్టీ పుంజుకుంటుందన్న ఉద్దేశంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను తీసుకొచ్చి రంగంలోకి దింపినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా షర్మిల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడం పార్టీ పుంచుకోకపోవడం వంటివి కాంగ్రెస్కు భారీ ఇబ్బందులుగా మారి రాబోయే రోజుల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎట్లా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ తనను తాను సంస్కరించుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on October 15, 2024 4:42 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…