Movie News

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ కన్నా ఇలా ఏదో ఒక వార్తతో ఎక్కువ సందడి చేస్తుంది. హిందీ సీరియల్స్ నుంచి సినిమాలకు ప్రమోట్ అయిన అమ్మడు చిన్నగా అక్కడ పట్టు సాధించే ప్రయత్నంలో ఉండగా హను రాఘవపూడి దృష్టిలో పడింది.

అలా సీతారామం అవకాశం దక్కించుకున్న మృణాల్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సీతారామం లో మృణాల్ అప్పియరెన్స్, పెర్ఫార్మెన్స్ ఇవన్నీ ఆమెను తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యేలా చేశాయి.

ఆ తరువాత హాయ్ నాన్న కూడా ఆమె నటనతో ఆకట్టుకుంది. ఐతే 3వ ప్రయత్నంగా చేసిన ది ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ మాత్రం డిజప్పాయింట్ చేసింది. 3 సినిమాలతోనే తెలుగులో సూపర్ పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ తర్వాత ఛాన్స్ లు అందుకోవడంలో వెనకబడింది. కల్కి 2898 AD సినిమాలో చిన్న క్యామియో చేసినా అది కెరీర్ కి ఉపయోగపడలేదు.

ఫైనల్ గా అడివి శేష్ డెకాయిట్ లో మృణాల్ ఛాన్స్ దక్కించుకుంది. సినిమాలో అడివి శేష్, మృణాల్ జోడీ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఐతే మృణాల్ గురించి సినిమాల పరంగా పక్కన పెడితే ఆమె ఎవరితో కాస్త క్లోజ్ గా కనిపించినా సరే విపరీతమైన రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

ఆమధ్య సుమంత్ తో కలిసి దిగిన ఫోటోతో సోషల్ మీడియా అంతా హడావిడి చేయగా అది సీతారామం టైం లో దిగిన ఫోటో అని తెలిసి సైలెంట్ అయ్యారు. ఇక ఈమధ్య కోలీవుడ్ స్టార్ ధనుష్ తో మృణాల్ ని కలిపి వస్తున్న వార్తలు తెలిసిందే.

ధనుష్ తో తనకి కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ అని మృణాల్ చెప్పినా కూడా ఈ వార్తలను ఆపట్లేదు. ఇక మరోపక్క మృణాల్ సిద్ధార్థ్ చతుర్వేదితో క్లోజ్ గా ఉండటంతో మళ్లీ టాపిక్ అతని మీదకు డైవర్ట్ అయ్యింది.

మొత్తానికి మృణాల్ ఠాకూర్ ఎవరితో క్లోజ్ ఉన్నా ఏదో జరుగుతుంది.. సంథింగ్ సంథింగ్ అనడం కామన్ అయ్యింది. సినిమాల కన్నా మృణాల్ కి ఈ విషయాలు ఆమెను ప్రేక్షకులకు టచ్ లో ఉండేలా చేస్తున్నా కూడా ఇలాంటి వార్తల వల్ల ఆమెకు ఇబ్బందే కానీ అంత ప్రొత్సాహకరంగా ఉండవని చెప్పడంలో సందేహం లేదు.

This post was last modified on February 5, 2026 7:01 am

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago