రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కొందరు బాగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. నిరంతరం… తమ శాఖలపై అప్రమత్తంగా ఉంటూ.. నిర్ణయాలను కూడా వేగంగా తీసుకుని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో చాలా తక్కువ మంది ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీడియా ముందైనా.. తెరవెనుకైనా.. కనిపిస్తున్నవారే కనిపిస్తున్నారు. పనిచేస్తున్నవారే చేస్తున్నారు. మరి మిగిలిన వారి సంగతేంటి? అనేది ప్రశ్న.
ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలైంది. ఇప్పటి వరకు కేవలం వంగలపూడి అనిత, గొట్టిపాటి రవి, సుధారాణి, సవిత, నిమ్మల రామానాయుడు, నారా లోకేష్, సత్యకుమార్, నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, నాదెండ్ల మనోహర్ వంటివారు మాత్రమే కనిపిస్తున్నారు. వారివారి శాఖలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ, మంత్రుల జాబితాలో అచ్చన్నాయుడు నుంచి అనేక మంది ఉన్నారు. మరి వీరంతా ఏమయ్యారు? ఏం చేస్తున్నారు? ఈ నాలుగు మాసాల్లో వీరి ప్రోగ్రెస్ ఏంటి? అనేది చర్చగా మారింది.
మంత్రివర్గంలో మొత్తం సీఎం , డిప్యూటీ సీఎంతో కలిపి 25 మంది ఉన్నారు. వీరిలో 10 మంది వరకు మంత్రులు పెద్దగా కనిపించడం లేదు. ఒకరిద్దరు అయితే.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. అసలు కనిపించని పరిస్థితి కూడా ఉంది. వీరిలో మహ్మద్ ఫరూక్, వాసం శెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. వీరు ఎక్కడా కనిపించరు. ఎప్పుడో నెలకు ఒకసారి ఇలా మొహం చూపించి అలా వెళ్లిపోతున్నారు. మరి వీరి పరిస్తితి ఏంటనేది చంద్రబాబు తేల్చుకోవాలి.
ఇక, సీనియర్ మంత్రి అచ్చన్నాయుడు అయితే.. కేవలం తన శాఖకు మాత్రమే పరిమితం అయినా.. అది కూడా 15 రోజులకు ఒకసారి మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. ఈయనకు హోం మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్ల రవీంద్ర కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. దీనికి వేరే కారణాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఆనం రామనారాయణరెడ్డి అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా.. అసంతృప్తితో ఉన్నారో.. లేక.. మరే కారణమో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం పెద్దగా దూకుడు చూపించకపోవడం గమనార్హం.
This post was last modified on October 15, 2024 1:43 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…