Political News

పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ చేశా..:  జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను తాను ‘తోపుగా’ అభివ‌ర్ణించుకున్న జ‌గ్గారెడ్డి.. రాజ‌కీయాల్లో దూకుడుగా ఉంటే త‌ప్పులేద న్నారు. 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ్గారెడ్డి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఏ నాయ‌కుడికైనా పార్టీకైనా ఓట‌మి అనేక పాఠాలు నేర్పిస్తుంద‌ని తెలిపారు. అయితే.. తాను పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

తాను బ‌ల‌హీనుడిని కాద‌ని.. అత్యంత బ‌ల‌వంతుడిన‌ని చెప్పుకొచ్చారు. ఎవ‌రికీ అదిరి, బెదిరి బ‌తికే మ‌న‌స్తత్వం త‌న‌కు లేద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు తానే.. తోపునని చెప్పుకొన్నారు. జ‌గ్గారెడ్డి అంటే.. ఓ ఫైట‌ర్‌. దీనిలో మ‌రో మాటే లేద‌న్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి త‌మ కుటుంబం ఎంతో రుణ ప‌డిపోయింద‌న్నారు. తాను ఓడిపోయినా.. త‌న స‌తీమ‌ణికి ఆయ‌న కార్పొరేష‌న్ ప‌దవిని ఇచ్చి గౌర‌వించార‌ని, పార్టీలోనూ త‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా గ‌త విష‌యాల‌నుజ‌గ్గారెడ్డి ప్ర‌స్తావించారు. 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను దూకుడుగా వ్య‌వ‌హ‌రించాన‌ని చెప్పారు. అప్ప‌టి ఎస్పీ అనుచ‌రుల‌ను కూడా కొట్టిన‌ట్టు తెలిపారు. అంతేకాదు.. ఎస్పీ కారును కూడా త‌న కారుతో ఢీ కొట్టించాన‌న్నారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లోనే రిగ్గింగ్ చేశాన‌ని.. త‌న‌ను ఎవ‌రూ ఆపేవారు లేర‌ని చెప్పారు. అయితే.. ఈ క్ర‌మంలోనే జ‌గ్గారెడ్డి వైరాగ్యం వ్య‌క్తం చేస్తూ.. ఇంత చేసినా ఏదో ఒక రోజు కాటికి వెళ్లాల్సిందేన‌న్నారు.

ఎన్నిక‌ల‌కు రాం రాం..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీచేయ‌డం లేద‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న భార్య నిర్మ‌ల రంగం లోకి దిగుతుంద‌న్నారు. ఇక‌, బీఆర్ ఎస్ నేత‌ల‌పై నిప్పులు చెరుగుతూ.. రుణ‌మాఫీని పూర్తి చేసినా.. కొంద రు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. వారికి ప్ర‌చారం ఎక్కువ‌, మాకు ప‌ని ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ విష‌యంలో చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని మాజీ మంత్రి హ‌రీష్ ద‌గ్గ‌ర లెక్క‌లు ఉంటే చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ రువ్వారు. 

This post was last modified on October 13, 2024 6:46 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో సర్కారీ వైద్యానికి కూటమి మార్కు బూస్ట్

ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…

11 minutes ago

వైసీపీ ఆ ఇద్దరి రాజకీయాన్ని చిదిమేసిందా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…

1 hour ago

‘టెస్ట్’ మ్యాచులో ఓడిపోయిన ప్రేక్షకుడు

ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…

2 hours ago

బోలెడు శుభవార్తలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్

దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…

2 hours ago

లెక్కంటే లెక్కే.. బాబు మార్కు పదవుల భర్తీ

నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా…

2 hours ago

కాకాణికి టెన్ష‌న్‌.. హైకోర్టు కీల‌క నిర్ణ‌యం!

వైసీపీ మాజీ మంత్రి, కీల‌క నాయ‌కుడు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.…

3 hours ago