ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి.. విపక్షంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ 100 రోజుల్లో విపక్షంగా వైసీపీ సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? అనేది ప్రశ్న. సహజంగానే ఏ పార్టీ అయినా.. వారాలు, నెలల లెక్కలో తమను తాము భేరీజు వేసుకుంటుంది. ఇలా చూసుకుంటే.. అధికారంలో ఉన్న కూటమి పార్టీలు.. తమ విజయాలను తాము నెమరు వేసుకుంటున్నాయి. వరదలపై విజయం, పలు వివాదాస్పద చట్టాల రద్దు, అదేవిధంగా ప్రఖ్యాత కంపెనీలను వెనక్కి తీసుకురావడంపై దృష్టి పెట్టాయి.
మరీ ముఖ్యంగా పెంచిన పింఛన్‌ను అమలు చేయడం కూడా కూటమి పార్టీలుసాధించిన విజయంగానే ఉంది. దీనికి తోడు జనసేన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పంచాయతీలను బలోపేతం చేస్తున్నారు. బీజేపీ కూడా తన వ్యూహం ప్రకారం ముందుకు సాగుతోంది. ఇలా.. మూడు పార్టీలు విజయా లపై ఒక స్పష్టమైన పద్ధతిలో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం విజయదశమిని ఘనంగా నిర్వహించుకుంటుండడం గమనార్హం.
ఇక, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ విషయానికి వస్తే.. ఏమేరకు ఈ పార్టీ విజయదశమిని నిర్వహించుకుంటోందన్న విషయం ప్రశ్నగానే మారింది. వంద రోజుల్లో ఆశించిన మేరకు జగన్ పూర్తిస్థాయిలో ప్రజల మధ్యకు రాలేకపోయారు. విపత్తులు వచ్చినా.. పలు చోట్ల బాలికలపై అఘాయిత్యాలు జరిగినా.. ఆయన తాడేపల్లికే పరిమితం అయ్యారు. అంతేకాదు.. పార్టీ నాయకులు కేసుల్లో చిక్కుకుని జైళ్లలో ఉంటే.. వారి కుటుంబాల తోనూ ఆయన భేటీ కాలేక పోతున్నారు. ఏదో జైలుకు వెళ్లి పరామర్శించి చేతులు దులుపుకొంటున్నారు.
మరోవైపు.. పార్టీని సంస్థాగతంగా ముందుకు నడిపించేందుకు కూడా జగన్ పెద్దగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఈ పరిణామాలతో వైసీపీ ప్రతిపక్షంగా ఉండి సాధించిన విజయం అంటూ ఏమీ కనిపించలేదు. ఏం జరిగినా.. ట్వీట్ రూపంలో స్పందించడం మరింత మైనస్ అయిపోయింది. రాష్ట్రంలో ట్విట్టర్‌ను ఫాలో అయ్యేవారు 1 శాతంలోపే ఉంటారు. వారు కూడా పదే పదే చూడరు. అయినా.. జగన్ ట్విట్టర్‌లోనే రాజకీయాలకు పరిమితం అయ్యారు. మొత్తంగా ఈ 100 రోజుల విపక్షంలో ఆయన ప్రధానప్రతిపక్ష హోదా పొందలేక పోయారు. ప్రజలకు కూడా చేరువ కాలేక పోయారు.
This post was last modified on October 13, 2024 10:35 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…