తాజాగా ఏపీలో నూతన మద్యం పాలసీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఆశించిన దానికంటే.. 10 శాతం తక్కువగానే దరఖాస్తులు వచ్చాయి. నిజానికి ఈ మద్యం పాలసీతో..దరఖాస్తుల రూపంలోనే సర్కారు 2500 కోట్ల రూపాయలకు పైగానే నిధులు సమీకరించాలని నిర్ణయించింది. అందుకే.. గతంలో లేని విధంగా దరఖాస్తు ఫీజును రూ.200000గా నిర్ణయించింది. దీనిని దుకాణం పెట్టుకునే అవకాశం వచ్చినా.. రాకున్నా.. తిరిగి చెల్లించరు.
ఇలా..మొత్తం లక్షకు పైగానే దరఖాస్తులు వస్తాయని లెక్కగట్టుకున్నారు. కానీ, 89 వేల దరఖాస్తులు వచ్చా యి. సరే.. ఆశించిన దానికంటే కొంత వరకు బాగానే ఉందని అంటున్నారు. ఇది ఎలా ఉన్నా.. ఎవరూ తక్కువ కారు.. తక్కవుగా లేరు! అని కొందరు సీనియర్ నాయకులు మద్యందుకాణాల దరఖాస్తుల ప్రక్రి యకు సంబంధించి చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సహజంగా మద్యం వ్యాపారం అంటేనే రాజకీయ నేతలకు పాడికుండ. దీంతో వచ్చిన అవకాశంఎందుకు వదులుకుంటారు?
ఇదే ఇప్పుడు జరిగింది. దరఖాస్తుల ప్రక్రియ నుంచే నాయకులు జోక్యం చేసుకున్నారు. దరఖాస్తు దారులను కట్టడి చేశారు. ఎక్కవగా పోటీ పడితే.. రేపు లాటరీలో తమ పేరు వస్తుందో రాదో అనే బెంగ కొంతమందిని వెంటాడింది. దీంతో వారంతా.. ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. ఈ క్రమంలో సీనియర్ నాయకులు మాత్రమే జాగ్రత్త పడ్డారని అనుకుంటే పొరపాటే. తొలిసారి జెండా పట్టుకున్నవారు.. తొలిసారి గెలిచిన వారు కూడా.. జోక్యం చేసుకుని.. బాగానే పోగేసుకున్నారన్నది టాక్.
నీకిది-నాకది తరహాలో ముక్కు మాత్రమే కాదు.. చెవులు కూడా పిండేసి.. ఒప్పందాలు చేసేసుకున్నార న్నది టీడీపీలోనే వినిపిస్తున్న మాట. నెలకు 25 % కమీషన్, ఆరు మాసాలకు ముడుపులు, అతిథులు (పెద్దనేతలు) నియోజకవర్గాలకు వస్తే.. పూర్తి ఖర్చు.. ఇలా కీలక నాయకులు లెక్కలు వేసుకుని ముందుగా నే దరఖాస్తు దారులతో లిఖిత పూర్వక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ విషయంలో టీడీపీ అనుకూల మీడియాకే తెలిసిపోయిందంటే.. ఎలా ఉందో అర్థమవుతుంది. అంతేకాదు.. అనంతపురంలో అయితే.. మహిళా నాయకులే.. చక్క బెట్టేశారంటే ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో తెలుస్తుంది.
This post was last modified on October 12, 2024 7:50 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…