ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పనిచేస్తున్న పలువురు కేడర్ ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాలతో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏపీకి రాలేదు. తెలంగాణలోనే పనిచేస్తున్నారు. అయితే.. కొన్నాళ్ల కిందట తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఏపీకి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్‌లను ఏపీకే పంపించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీకి కేటాయించిన అధికారులు తక్షణమే ఏపీలో బాధ్యతలు చేపట్టాలని పేర్కొంది. అయితే.. వీరికి ఉత్తర్వులు అంది.. తట్టా బుట్టా సర్దుకునేందుకు.. ఐదు రోజుల సమయం కేటాయించింది. గతంలో కూడా.. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ సోమేష్ కుమార్కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనను ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణలోనే కొనసాగించాలని ఆయన కోరుకున్నారు.
కానీ, న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో సోమేష్ ఏపీకి తరలిరాక తప్పలేదు. అయితే.. ఆయన జగన్ హయాంలో ఇలా వచ్చి.. అలా వీఆర్ ఎస్‌కు అప్లయ్ చేశారు. అనంతరం. కేసీఆర్ సర్కారు(అప్పటికి ఎన్నికలు జరగలేదు) ప్రభుత్వ సలహాదారుగా బాధ్యలు చేపట్టారు. ఇదిలావుంటే, తాజా జాబితాలో కీలక అధికారులు ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. వీరిలో సీనియర్లు ఉండడం గమనార్హం.
ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఎస్‌లు అంజనీ కుమార్, అభిషేక్ మొహంతి ఉన్నారు. అయితే.. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ఫార్ములాను ఏపీకి కూడా అమలు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు కేటాయించిన అధికారులు ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. వారిని కూడా తెలంగాణకు బదిలీ చేస్తూ.. కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. వారిలో ఎస్ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటి ఉన్నారు. వీరంతా ఐఏఎస్‌లే కావడం గమనార్హం.
This post was last modified on October 11, 2024 10:05 am
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…