Political News

ఈవీఎంల ట్యాంపరింగ్ పై మరోసారి జగన్ హాట్ కామెంట్స్

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల విషయంలో ఏం జరిగిందో తెలీదని, కానీ, ఆధారాలు లేవని జగన్ అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈవీఎంల వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.

ఏపీ లాగానే హర్యానా ఎన్నికల ఫలితాలు కూడా ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభల్లోని సభ్యులు ముందుకు రావాలని, ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ల వినియోగంపై ఆలోచించాలని కోరారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా హర్యానా ఫలితాలు ఉన్నాయని. ఏపీలో కూడా హర్యానా మాదిరి ఫలితాలే వచ్చాయని అన్నారు. ఇక, నారా లోకేష్ మాదిరి రెడ్ బుక్ మెయింటైన్ చేయడం తమకు పెద్ద పని కాదని, కానీ దాంతోపాటు తాము గుడ్ బుక్ కూడా మెయింటైన్ చేస్తామని జగన్ చెప్పారు. వైసీపీ కోసం కష్టపడిన నేతల పేర్లను ఆ గుడ్ బుక్ లో రాసుకుంటామని అన్నారు.

అంతేకాదు, రాబోయ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ ప్రమోషన్లు, పదవులు ఇస్తామని జగన్ ప్రకటించారు. లోకేష్ రెడ్ బుక్ అని విష సంస్కృతికి బీజం వేశారని, ఇప్పుడు తాను చేయొద్దని చెప్పినా వైసీపీ నేతలు వినే పరిస్థితులు లేవని, అన్యాయం చేసిన పేర్లు, అటువంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారని జగన్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలతో సమావేశమైన జగన్ ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులున్నాయని, పార్టీ కార్యకర్తలను పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.

This post was last modified on October 10, 2024 12:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌మిలికి జై:  చంద్ర‌బాబు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు జై కొట్టారు. తాము ఈ ఎన్నిక‌ల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు చెప్పారు.…

3 hours ago

రెడ్ బుక్ కాదు.. గుడ్ బుక్‌ పెడ‌తాం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం మాట్లాడితే.. రెడ్ బుక్‌..…

3 hours ago

మోడీని దేశం భుజాల‌కెత్తుకుంది..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని దేశ ప్ర‌జ‌లు భుజాల‌కు ఎత్తుకున్నార‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. హ‌రియాణాలో వ‌రుస‌గా మూడోసారి బీజేపీ…

3 hours ago

బిగ్ న్యూస్ : విశాఖ‌కు టీసీఎస్‌.. ఫ‌లించిన లోకేష్ కృషి

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫ‌లించింది. ఆయ‌న మంగ‌ళ‌వారం బెంగ‌ళూరులో టాటా స‌న్స్ చైర్మ‌న్…

3 hours ago

జైల్లోనే న‌న్ను చంపాల‌ని చూశార‌ట‌: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఒక దాని త‌ర్వాత‌..ఒక‌టి ఆయ‌న సంచ‌ల న కామెంట్ల‌తో…

3 hours ago

తారక్ హృతిక్ కాకుండా మరో ఇద్దరు ?

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న క్రేజీ మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం తారక్ లేకుండా…

9 hours ago