AP CM YS Jagan Pressmeet
కరోనా మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పెట్టిన ప్రెస్ మీట్లు ఎంతగా ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయో తెలిసిందే. కరోనా గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్లు విమర్శల పాలయ్యాయి. అవి చాలవన్నట్లు కరోనా పుట్టింది కొరియాలో అంటూ తన అవగాహన లేమిని చాటుకున్నాడు. ఈ విషయాల్లో మీడియాను ఫేస్ చేయడం ఆయనకు చాలా కష్టమైంది.
ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ సోషల్ మీడియాలో జనాలు తనను ఆడేసుకుంటుండటంతో రూటు మార్చి రికార్డెడ్ వీడియోలు ప్రెస్‌కు రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు జగన్. ఐతే తాజాగా సోమవారం మధ్యే మార్గంగా.. ప్రెస్ లేకుండా నేరుగా లైవ్‌లో మీడియాకు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్. సాక్షి, టీవీ9 లాంటి ఛానెళ్లు ఏపీ సీఎం ప్రజలనుద్దేశించి లైవ్‌లో మాట్లాడుతున్నట్లు ఫీడ్ మొదలు పెట్టాయి.
ఐతే పేరుకే ఇది లైవ్ అని.. ఇది కూడా ఇంతకుముందు లాంటి రికార్డెడ్ వీడియోనే అనే విషయాన్ని సోషల్ మీడియా జనాలు బయటపెట్టేశారు. కొన్ని చోట్ల జగన్ వాయిస్ జంప్ కావడం.. దృశ్యంలో మార్పు రావడం స్పష్టంగా కనిపించింది. అది చాలదన్నట్లు లైవ్ వీడియోలో జగన్ ఒక్కో చోట ఒక్కో రకమైన టైమ్ చూపించడంతో ఇది లైవ్ కాదనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది.
ఒక చోట ఒంటి గంట కావస్తున్నట్లు టైం చూపించగా.. ఇంకో చోట ఏకంగా సమయం ఐదు గంటలు దాటిపోయింది. దీంతో జగన్ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని.. బాగా ప్రాక్టీస్ చేసి.. టేక్‌ల మీద టేక్‌లు తీసుకుని తాపీగా ఈ మెసేజ్ ఇచ్చాడని.. కానీ చివరికిది లైవ్ అని భ్రమింపజేసే ప్రయత్నం టీవీ ఛానెళ్లు చేశాయని స్పష్టంగా తెలిసిపోయింది. దీనిపై వైకాపా వర్గాలు ఎలా డిఫెండ్ చేసుకుంటాయన్నది ఆసక్తికరం.
This post was last modified on April 28, 2020 1:00 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…