తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నా రు. ఇటీవల వెలుగు చూసిన తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం అనంతరం చంద్రబాబు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిలో భాగంగా ఎక్కడికక్కడ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కార్యనిర్వహణాధికారి(ఈవో) జె. శ్యామలరావును ఆదేశించారు. లడ్డూ ప్రసాదం నుంచి భోజన ప్రసాదాల వరకు కూడా భక్తుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పారు.
భక్తుల మనోభావాలు.. వారి అభిప్రాయాలు తెలుసుకుని.. వాటికి అనుగుణంగా ముందుకు సాగాలని కూడా అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈవిషయంలో టైం లేదని.. పనులు ఉన్నాయని తనకు చెప్పవద్దని కూడా ఆదేశించారు. అంతే! ఈవో శ్యామలరావు రంగంలోకి దిగిపోయారు. ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో చేతినిండా ఊపిరి సలపనంతగా పని ఉన్నా.. ఆయన సామాన్య భక్తుల మధ్యకు వచ్చేశారు.
సోమవారం ఉదయాన్నే ఆయన పుష్కరిణి, వైకుంఠం క్యూకాంప్లెక్సులలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి భక్తుడి చెంతకు వెళ్లి.. దర్శనం నుంచి వసతుల వరకు.. లడ్డూ ప్రసాదం నుంచి అన్నసంతర్పణ, క్యూలైన్లలో ఇస్తున్న ప్రసాదాలు, ఆహారం, టీ, కాఫీ వంటి వాటి గురించి కూడా చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ పలకరించి.. ప్రసాదాల నాణ్యతపై ఆరా తీశారు. ఆయా వివరాలను శ్యామలరావు నోట్ చేసుకున్నారు. ఇలా.. చంద్రబాబు చెప్పిన వెంటనే రంగంలో దిగి తమ అభిప్రాయాలు సేకరించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ ఫిర్యాదులు-సూచనలు
This post was last modified on October 7, 2024 9:32 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…