ఏదైనా సినిమా రిలీజ్ టైంలోనో ఇంకో సందర్భంలోనో మీడియా ముందు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల గురించి పొడి పొడిగా రెండు మూడు మాటలు మాట్లాడ్డమే తప్ప మెగా మదర్ అంజనాదేవి ఇన్నేళ్లలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు.
కానీ ఇప్పుడామె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం ఆసక్తి రేకెత్తించే విషయం. అది కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడ్డానికే ఆమె ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో పవన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు అంజనా దేవి. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘‘తనకు మేం చిన్నపుడు పెట్టిన పేరు.. శ్రీ కళ్యాణ్ కుమార్. అది శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పేరు. తర్వాత ఎవరో పేరులో పవన్ చేర్చారట. అది ఎవరో నాకు తెలియదు. చిన్నపుడు కళ్యాణ్ నెలల పిల్లాడిగా ఉండగా తిరుమల దర్శనానికి వెళ్లాం. అప్పటికి తనకు ఆరో నెల వచ్చింది.
అక్కడే అన్నప్రాసన చేద్దామని నాకు మనసులో అనిపించింది. వెంకట్రావుగారు పోలీస్ కావడం వల్ల ఆయన దగ్గర ఎప్పుడూ చిన్న కత్తి ఉండేది. ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం పెడితే.. పవన్ ముందు కత్తి పట్టుకున్నాడు. తర్వాత పెన్ను పట్టుకున్నాడు. కత్తి పట్టుకున్నాడు కదా పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికి ఏదో చేస్తాడని అప్పుడే అనుకున్నాను. చిన్నప్పట్నుంచి కళ్యాణ్ ఎక్కువగా నాన్నతో ఉండేవాడు. ఎక్కువగా మాట్లాడడు. మితభాషి. అందుకే వాళ్ల నాన్నకి తనంటే ఎక్కువ ఇష్టం.
తనకు దీక్షలు తీసుకోవడం చిన్నప్పట్నుంచి అలవాటే. దైవభక్తి కూడా ఎక్కువే. అయ్యప్ప దర్శనానికి వెళ్లాలని ఓసారి అడిగితే నా కోసం మాల వేసుకున్నాడు. 40 రోజుల తర్వాత వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాం. పవన్ రాజకీయాల్లోకి వచ్చి కష్టపడుతుంటే, పగలూ రేయనక తిరుగుతుంటే బాధనిపించింది. కానీ అతను పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం అందుకున్నాడు. పవన్ ఏనాడూ కష్టం గురించి ఆలోచించలేదు.
ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు. సుఖం కోరుకోడు. షూటింగ్ చేసి అలసిపోయి వచ్చి సోఫాలో నిద్రపోయేవాడు. ఇంత కష్టపడ్డాను అని ఏ రోజూ చెప్పుకోలేదు. చిన్నప్పట్నుంచి కూడా పెద్దగా కోరికలు ఉండేవి కావు. ఇది కావాలని అడిగేవాడు కాదు’’ అని అంజనాదేవి చెప్పారు.
This post was last modified on October 4, 2024 4:40 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…