తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనిని నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. మొత్తం 4 నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించినట్టు టీటీడీ అధికారులు కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆ ట్యాంకర్లను ఎవరివన్నది తేల్చిన అధికారులు సదరు నెయ్యిని పంపిన కంపెనీపై కేసు నమోదు చేశారు. తమిళనాడులోని దుండిగల్ జిల్లాకు చెందిన ‘ఏ ఆర్’ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి ఈ ట్యాంకర్లు సరఫరా అయ్యాయి. మొత్తంగా ఈ సంస్థ నుంచి 8 ట్యాంకర్లు రాగా.. నాలుగు ట్యాంకర్లలో నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు సరిపోలలేదని గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే ఏఆర్ సంస్థపై విమర్శలు కూడా వచ్చాయి. గత వైసీపీ హయాంలో అప్పటి వరకు కర్ణాటకకు చెందిన నందిని నెయ్యిని తిరుమలకు దిగుమతి చేసుకునేవారు. ఆ నెయ్యినే భోజనాలు, దీపారాధన, లడ్డూ ప్రసాదాలకు కూడా వినియోగించే వారు. అయితే.. వైసీపీ హయాంలో నందిని నెయ్యి కాంట్రాక్టును రద్దు చేసి.. తక్కువ ధరకే ఇస్తామని ముందుకు వచ్చిన ఏఆర్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఈ క్రమంలోనే కల్తీ జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా.. సీరియస్ కావడం, ఈ విషయం దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపారు.
విచారించిన పోలీసులు.. ఏఆర్ సంస్థ యాజమాన్యంపై ఆహార పదార్థాల కల్తీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. సోమవారం ఈ మేరకు కేసు నమోదు చేయడంతో సంస్థ ఎండీ రాజశేఖరన్ అలెర్ట్ అయ్యారు. వెంటనే ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసు చట్టబద్దంగా లేదని పేర్కొన్నారు. చట్ట నిబంధనలు పాటించకుండానే తనపై కేసు పెట్టారని.. వాస్తవానికి ముందుగా నోటీసులు ఇచ్చి తమ వివరణ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ, పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎలాంటి వివరణా తీసుకోకుండానే కేసు నమోదు చేసినట్టు పిటిషన్‌లో వివరించారు.
ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రాజశేఖరన్ కోర్టును అభ్యర్థించారు. కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని పేర్కొన్నారు. అదేవిధంగా దర్యాప్తు అధికారులకు కూడా సహకరిస్తానని తెలిపారు. దర్యాప్తు అధికారులు తనను అరెస్టు చేయకుండా, ఎలాంటి తొందర పాటు చర్యలకు దిగకుండా కూడా ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. ఇదిలావుంటే.. మరో వైపు సిట్ అధికారులు తిరుమలలో దర్యాప్తును ముమ్మరం చేశారు. లడ్డూ వివాదానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ కూలంకషంగా విచారిస్తున్నారు. ఏ ఒక్క ఆధారాన్నీ వదలకుండా విచారిస్తున్నారు.
This post was last modified on October 1, 2024 9:05 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…