ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి వస్తారని.. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు జోరుగా ప్రచారం సాగింది. ఆయన కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం చేస్తారని టీడీపీ నేతలు కూడా ప్రచారం చేశారు. విజయవాడ ఎంపీ లేదా, గుంటూరు స్థానం నుంచి బ్రాహ్మణి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారంలోకి వచ్చింది. పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఆమె ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.
అయితే.. తరచుగా మాత్రం నారా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రంపై చర్చసాగుతూనే ఉంది. తాజాగా ఈ విషయంపై ఆమె అత్త, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణి ఎప్పటికీ రాజకీయాల్లోకి రాబోరని ఆమె తెలిపారు. ఆమెకు అసలు రాజకీయాలంటే ఇష్టమేలేదన్నారు. ముఖ్యంగా రాజకీయాలంటే బ్రాహ్మణికి అస్సలు పడదని.. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు. తనకు వ్యాపారం చేసుకోవడం, స్వతహాగా ఎదగడమే ఇష్టమని భువనేశ్వరి చెప్పారు.
ప్రస్తుతం హెరిటేజ్ సంస్థలో కీలక రోల్ పోషిస్తున్న బ్రాహ్మణి.. ఆ సంస్థ ఎదుగుదలలో ముందున్నారని భువనేశ్వరి వివరించారు. ఇదిలావుంటే, 2019 ఎన్నికల సమయంలో రాజకీయంగా దూకుడు ప్రదర్శించిన బ్రాహ్మణి.. మంగళగిరి నియోజకవర్గంలో తన భర్త, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కోసం ప్రచారం చేశారు. ఎన్నికల బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. ఆ తర్వాత.. చంద్రబాబు అరెస్టు అయిన సందర్భంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను, ముఖ్యంగా మహిళా నాయకులను కదిలించడం లోనూ బ్రాహ్మణి ముందున్నారు. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా సాగిన నిరసనకు నేతృత్వం వహించారు.
ఇక, ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రాహ్మణి ఇక్కడ తన భర్త గెలుపు కోసం అనేక రూపాల్లో కృషి చేశారు. ప్రతి ఒక్కరినీ కలిశారు. ప్రతి ఇంటికీ వెళ్లారు. ఇదేసమయంలో నందమూరి ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపి ప్రచారం చేయించారు. ఇలా.. తనదైన శైలిలో బ్రాహ్మణి పరోక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందన్న చర్చసాగింది. కానీ, ఆమెకు ప్రత్యక్ష రాజకీయాలు ఇష్టంలేదని స్వయంగా భువనేశ్వరి వెల్లడించడం గమనార్హం.
This post was last modified on October 1, 2024 9:00 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…