Political News

జ‌న‌సేన ఎఫెక్ట్‌.. కాంగ్రెస్ డీలా!

ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. విశ్లేష‌కులు ఈ మాటే చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో వ‌ల‌స రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. ఒక‌వైపు వ‌ర‌ద‌లు-ప‌రిహారం విష‌యాలు రాజకీయంగా దుమారం రేపుతున్నా.. మ‌రోవైపు ఓడిపోయిన నాయ‌కులు, వైసీపీ నేత‌లు.. త‌మ దారులు తాము చూసు కుంటున్నారు. ఈ క్ర‌మంలో మెజారిటీ నాయ‌కులు జ‌న‌సేన‌వైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో ఉండ‌లేక చాలా మంది జంప్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే బాలినేని శ్రీనివాస‌రెడ్డి, ఉద‌య‌భాను వంటి కీల‌క నాయ‌కులు జ‌న‌సేన జెండా క‌ప్పుకొన్నారు. ఇక‌, స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి కూడా వంద‌ల సంఖ్య‌లో నాయ‌కులు పార్టీలు మారుతున్నారు. వీరంద‌రి చూపు.. టీడీపీ కంటే జ‌న‌సేన వైపే ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. టీడీపీలో నేత‌లు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఇలా జ‌న‌సేన వైపు చూస్తున్నార‌న్న‌ది ఒక చ‌ర్చ‌. అయితే.. వైసీపీని చీల్చి తాము ల‌బ్ది పొందాల‌ని కాంగ్రెస్ భావించింది.

ఈ క్ర‌మంలోనే వైఎస్ కుమార్తె ష‌ర్మిల‌కు పార్టీ ప‌గ్గాలు కూడా అప్ప‌గించింది. అయినా కూడా ఎవ‌రూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూప‌డం లేదు. వెళ్తే.. టీడీపీ, లేక‌పోతే జ‌న‌సేన అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగ‌ని ష‌ర్మిల నాయ‌క‌త్వాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. ఆమె చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్లు కూడా ఇవ్వ‌డం లేదు. ఈ ప‌రిణామాలు కాంగ్రెస్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. జ‌న‌సేనలో చేరుతున్న నాయ‌కుల‌ను ప‌రిశీలిస్తే.. వీరికి సుదీర్ఘ‌కాలం.. వైఎస్‌తో అనుబంధం ఉంది.

అలాంటి నాయ‌కులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు కానీ, ష‌ర్మిల వైపు కానీ మొగ్గు చూప‌డం లేదు. దీంతో ఇక‌, జ‌న‌సేన కాద‌ని అంటే త‌ప్ప‌.. ఆ నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరే ప‌రిస్థితిలేదు. కానీ, జ‌న‌సేన‌కు కేడ‌ర్ లేక‌పోవ‌డం, బ‌ల‌మైన నాయ‌కుల అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో వ‌ద్ద‌నే ప‌రిస్థితి లేదు. పైగా.. కాంగ్రెస్ బ‌ల‌ప‌డితే.. త‌మ ఓటు బ్యాంకు చీలిపోయే ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంటుంది. అందుకే.. జ‌న‌సేన ఎవ‌రు వ‌చ్చినా రెడీ అంటూ.. చేర్చేసుకుంటండ‌డంతో కాంగ్రెస్ డీలా ప‌డుతోంది.

This post was last modified on September 30, 2024 3:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago