గత ఐదేళ్లు అంతులేని అధికారం అనుభవించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలందరికీ ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. అధికారంలో ఉండగా విర్రవీగి ప్రవర్తించడంతో జనాలకు వాళ్ల మీద వెగటు పుట్టింది. దీంతో ఎన్నికల్లో వారికి దిమ్మదిరిగే ఫలితాన్ని అందించారు. ఫలితాలు వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా వైసీపీ మీద వ్యతిరేకత ఏమీ తగ్గిన సంకేతాలు కనిపించడం లేదు.
వైసీపీ హయాంలో విపరీతమైన నెగెటివిటీ తెచ్చుకున్న నేతల్లో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా ఒకరు. హద్దులు దాటిన మాటలు, అవినీతి వ్యవహారాలతో ఆమె జనాల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. అధికారం పోయాక కొంత కాలం సైలెంటుగా ఉన్న రోజా.. ఇటీవల మళ్లీ పార్టీ తరఫున వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుబట్టారు. తమ పార్టీని వెనకేసుకొచ్చారు.
ఐతే పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని తరచుగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు వెళ్లడం ద్వారా రోజా తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ దర్శనాలతో ఆమె డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఎప్పట్నంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వ్యవహారంపై రోజా వైసీపీని వెనకేసుకొచ్చేసరికి జనాలకు ఇంకా మండిపోతోంది.
తిరుమల ఎవరి హయాంలో మెరుగ్గా ఉంది.. లడ్డు విషయంలో ఎవరిది తప్పు అంటూ ఆమె తన యూట్యూబ్ ఛానెల్లో పోల్స్ పెట్టగా.. మెజారిటీ జనాలు చంద్రబాబుకు జై కొట్టారు. జగన్‌ను ఛీకొట్టారు. ఈ పోల్ రిజల్ట్స్ తాలూకు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రోజా పనిగట్టుకుని జగన్ పరువు తీసినట్లయింది.
ఈ దెబ్బకు తన యూట్యూబ్ ఛానెల్‌నే రోజా మూసేయాల్సి వచ్చింది. ఈ ఛానల్లో రోజా తరచుగా వీడియోలు పోస్ట్ చేసేది. అది ఆమె అఫీషియల్ ఛానెల్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆమె తాను యూట్యూబ్‌లో లేనని పేర్కొంటూ వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మాత్రమే ఉన్నట్లు తాజాగా పోస్ట్ పెట్టడం గమనార్హం. మొత్తానికి రోజా అవసరం లేని పోల్స్ పెట్టి యూట్యూబ్ ఛానెల్‌నే మూసుకోవాల్సి వచ్చిందన్నమాట.
This post was last modified on September 25, 2024 3:03 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…