ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లను కైవసం చేసుకున్న కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, కూటమిలో సీట్ల సర్దుబాటు క్రమంలో మూడు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలకు టికెట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, నామినేటెడ్ పోస్టులపై మూడు పార్టీల నుంచి ఎంతో మంది ఆశావహులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ ఉత్కంఠకు తెర దించుతూ తాజాగా చంద్రబాబు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఆశావహులకు చంద్రబాబు తీపి కబురు చెప్పారు. వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులను చంద్రబాబు సర్కార్ భర్తీ చేసింది. గత ఎన్నికల్లో పొత్తుల వల్ల టిక్కెట్ దక్కించుకోలేక పోయిన నేతలకు, టిక్కెట్లు త్యాగం చేసిన నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో చంద్రబాబు ప్రాధాన్యత కల్పించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు చంద్రబాబు.
20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు వీరే..
This post was last modified on September 24, 2024 6:30 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…