తిరుమల లడ్డూ వివాదం తెరమీదికి వచ్చిన దరిమిలా ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఈ విషయాన్ని మరింత తీవ్రంగా భావిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు కూర్చున్నారు. మరోవైపు.. బీజేపీ నాయకులు కూడా దీనిని సీరియస్‌గా తీసుకున్నా రు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటిపై దాడికి కూడా యత్నం చేశారు. అంటే.. మొత్తంగా చూస్తే.. హిందూ అజెండా ఈ రెండు పార్టీల్లోనూ కీలకంగా మారింది.
అంతేకాదు.. ఆది నుంచి కూడా బీజేపీతో ఉన్న సఖ్యత నేపథ్యంలో జనసేన అధినేత పవన్.. తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని.. దీక్షకు కూర్చోవడంతో జాతీయస్థాయిలో ఈ విషయం చర్చకు వచ్చింది. నిజానికి ఇలాంటి విషయాలు వెలుగు చూసినప్పుడు బీజేపీ నాయకులు స్పందించి నిరసనలకు దిగడం.. కామన్. ఇప్పుడు వారిని మించిన స్థాయిలో పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్నిభుజాన వేసుకున్నారు.
హిందూ విశ్వాసాలపై జరిగిన దాడిగా ఆయన పేర్కొంటూ.. దీక్షకు కూర్చున్నారు. ఈ పరిణామం.. వైసీపీని నానా తిప్పలు పెడుతోంది. క్షేత్రస్థాయిలో వాడవాడలా ఇప్పుడు పవన్ దీక్ష వ్యవహారం చర్చగా మారింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. దీక్ష గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ చర్చ వచ్చినా.. పవన్ దీక్ష గురించే కీలకంగా చర్చించుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. హిందువులను గుండుగుత్తగా జనసేన వైపు నడిపించే కీలక అంశం.
అంతేకాదు.. ఇప్పటి వరకు వైసీపీకి హిందూ సామాజిక వర్గాల్లో అంతో ఇంతో ఉన్న సానుభూతిని పటాపంచలు చేసేలా పవన్ దీక్ష ప్రభావం చూపనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక, బీజేపీ చేస్తున్న నిరసనలు కూడా అంతే ప్రభావం చూపుతున్నాయి. నాయకులు కూడా స్పందిస్తున్నారు. జాతీయ స్థాయిలో చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా.. బీజేపీ+జనసేన చేస్తున్న దూకుడు రాజకీయం.. వైసీపీని పూర్తిస్థాయిలో నేలమట్టం చేయడంఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 23, 2024 9:51 am
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…