సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను బెదిరించి తనపై ఆదిమూలం అత్యాచారం చేశారని ఆ మహిళ ఆరోపించడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆదిమూలంపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని సదరు మహిళ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తన ఫిర్యాదు ప్రకారం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తమని ఆ మహిళా స్వయంగా హైకోర్టులో హాజరై అఫిడవిట్ దాఖలు చేయడం షాకింగ్ గా మారింది. ఆదిమూలంపై పెట్టింది తప్పుడు కేసు అని, దానిని కొట్టివేయాలని జడ్జికి ఆ మహిళ చెప్పడం సంచలనం రేపింది. మూడో వ్యక్తి ఒత్తిడితోనే ఆదిమూలంపై బాధిత మహిళ అటువంటి ఆరోపణలు చేశారని, ఇది హనీ ట్రాప్ అని ఆదిమూలం తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఇక, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అవాస్తమని, ఆ ప్రకారం అఫిడవిట్ దాఖలు చేశామని బాధిత మహిళా తరపు న్యాయవాది వాదించారు వీటిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు కొట్టివేయాలని కోరారు. ఇక, పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండానే తనపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆదిమూలం గతంలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఆ మహిళ దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కు న్యాయమూర్తి వాయిదా వేశారు. అయితే, తనను ఎమ్మెల్యే బెదిరించి రేప్ చేశారని ఆరోపించిన మహిళ ఇప్పుడు ఆ ఆరోపణలు అవాస్తవమని చెప్పడం, కేసు కొట్టేయాలని కోరడం చర్చనీయాంశమైంది. ఏదేమైనా ఈ కేసు కొట్టివేస్తే ఎమ్మెల్యే ఆదిమూలం తో పాటు టీడీపీకి ఊరట లభించినట్లవుతుంది.
This post was last modified on September 21, 2024 1:19 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…