రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల సమయంలో ఈ వ్యవహా రం వివాదంగా మారింది. దీంతో వారిని ఎన్నికలకు ముందు పక్కన పెట్టారు. అదేవిధంగా జగన్ హయాంలోనే ప్రతి 2 వేల ఇళ్ల పరిధిలో ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ప్రభుత్వంలోని మునిసిపల్ నుంచి రెవెన్యూ వరకు పోలీసు నుంచి ఇరిగేషన్ వరకు అన్ని శాఖలకు సంబంధించి సెక్రటరీలు, అడ్మిన్‌లను ఏర్పాటు చేశారు.
అయితే.. వీటి వల్ల ప్రత్యేకంగా వచ్చిన లబ్ధి, ప్రజలకు అందిన ప్రత్యేక సేవలు లేవని భావిస్తున్న కూటమి ప్రభుత్వం సచివాలయాలను ఆయా ప్రభుత్వాల శాఖలకు అటాచ్ చేయనున్నారు. అదేవిధంగా కొన్నింటిని కలిపివేయనున్నారు. ఈ మేరకు తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా వలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వీరంతా పక్కన ఉన్న విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో 2.3 లక్షల మంది వాలంటీర్లకు గాను.. 1.7 లక్షల మంది వైసీపీ నేతల ఒత్తిడితో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
మిగిలిన వారిలోనూ చాలా మంది వేరే ఉపాధి చూసుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వలంటీర్లను ప్రభుత్వ శాఖలకు అటాచ్ చేస్తారు. వారి నైపుణ్యం.. సహా ఇతర విద్యార్హతలను బట్టి ఆయా శాఖల్లో వారికి అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వారికి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం ఇవ్వనున్నారు. అయితే.. రాజీనామా చేసిన వారిని మాత్రం తీసుకునేది లేదని మంత్రి వర్గ సమావేశంలో పలువురు మంత్రులు తేల్చి చెప్పడం గమనార్హం. ఇక, వలంటీర్ల విద్యార్హతను కూడా పెంచే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఓకేచేసింది. ఈ విషయాలపై చర్చించి.. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించేందుకు కేబినెట్ ఆమోదించింది.
This post was last modified on September 18, 2024 10:40 pm
ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్ ప్లాట్ఫారంగా గుర్తింపు పొందిన ఓయో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మేజర్ వయసు ఉన్నవారెవరైనా…
గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటిదాకా నాలుగు పాటలు రిలీజైనా అభిమానులు హ్యాపీనే కానీ ఇంకేదో మిస్సయ్యిందనే ఫీలింగ్ వాళ్లలో కొంత…
అన్ స్టాపబుల్ సీజన్ 4 మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఎందుకంటే…
టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవాలన్న ఆశలు తారుమారయ్యాయి. సిడ్నీలో జరిగిన ఐదో టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు…
సాక్ష్యాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి అందులోనూ కోట్లాది అభిమానులున్న పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్టేజి మీద పొగడటం కన్నా ఎవరికైనా…
ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి…